Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడేనా?
నందమూరి తారక రామారావు తాత వారసత్వాన్ని సినీ రంగంలో అందిపుచ్చుకున్నారు. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టిన రోజును ఇటీవల జరుపుకున్నారు. అయితే రెండున్నర దశాబ్దాల నుంచి సినీ రంగంలో ఎనలేని కృషి చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ఎనలేని ప్రేక్షకులను అందిపుచ్చుకున్నారు.

Politics: నందమూరి తారక రామారావు తాత వారసత్వాన్ని సినీ రంగంలో అందిపుచ్చుకున్నారు. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టిన రోజును ఇటీవల జరుపుకున్నారు. అయితే రెండున్నర దశాబ్దాల నుంచి సినీ రంగంలో ఎనలేని కృషి చేసి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ఎనలేని ప్రేక్షకులను అందిపుచ్చుకున్నారు. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లో ప్రస్తుతం రాణిస్తున్నారు. సినిమాకి ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తారు. నటన, డ్యాన్స్‌తో తనదైన శీలితో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కి ఉన్న గుర్తింపును కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెచ్చుకున్నారు. అయితే తాతా లాగానే రాజకీయాల్లోకి కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రాజకీయాల కోసం అడిగితే జూనియర్ ఎన్టీఆర్ దాని సమయం వచ్చినప్పుడు వస్తుందని చాలా సార్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ తన బ్లడ్‌లోనే రాజకీయం ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? అంటే వస్తారనే మాట వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి తప్పకుండా ఉన్నతమైన పదవులు ఏలుతారని అనిపిస్తుంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.
Read Also: ట్రెండ్ అవుతున్న భైరవం బాయ్ కాట్.. ఎందుకోసమంటే?
ఇదిలా ఉండగా.. వార్ 2 టీజర్ ఇటీవల వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే రెండు రోజుల కిందట హృతిక్ రోషన్ ట్వీట్టర్‌లో.. ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన ఏం జరగబోతుందో తెలుసా? నువ్వు కలలో కూడా ఊహించనది నా దగ్గర ఉంది. రెడీగా ఉన్నావా? అని ట్వీట్ చేశారు. టీజర్ గ్లింప్స్ అయితే అదిరింది. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నాడు. పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అలా జరగలేదు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే మూవీ పై ఎలాంటి అప్డేట్ రాకపోయేసరికి ఫ్యాన్స్ నిరాశ చెందారు.
Read Also: పచ్చిమిర్చితో గుండెపోటు ప్రమాదం తగ్గుతుందా?
సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబోలో 2019లో వార్ మూవీ వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఏడాది రిలీజ్ అయిన మూవీస్‌లో వార్ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ నటించారు. అయితే ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఈ వార్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్, RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.