Jagan Comments On TDP Government: 3 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం పోయి వైసీపీ అధికారంలోకి వస్తుంది
Jagan Comments On TDP Government రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తన వద్దకు వస్తున్నారని, అది చూసి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.

Jagan Comments On TDP Government: మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలకు తెలిసిపోయిందని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు తన వద్దకు వస్తున్నారని, అది చూసి చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం ఉధృతమవుతోంది. తాజాగా, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నటనపై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “దానవీర శూర కర్ణ కన్నా చంద్రబాబు గొప్పగా నటిస్తున్నారని, ఆయన యాక్టింగ్ ముందు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎందుకు పనికి రాదని” జగన్ ఎద్దేవా చేశారు.
3 ఏళ్లలో #ChandrababuNaidu ప్రభుత్వం పోతుంది.. @YSRCParty పార్టీ వస్తుంది అని ప్రజలకు తెలిసిపోయింది.
అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన ప్రజల నా దగ్గరకు వస్తున్నారు.. అది చూసి చంద్రబాబు తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు – మాజీ సీఎం @ysjagan pic.twitter.com/uMCghn9LRF
— greatandhra (@greatandhranews) July 16, 2025