Airlines: మార్కెట్లో ఏ ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా ఎంత? మొదటి ప్లేస్‌లో ఉన్నది ఎవరంటే?
Airlines: దేశంలో ఎన్నో విమానయాన సంస్థలు ఉన్నాయి. సాధారణ వ్యాపారాలకే కోట్లు అవుతుంది. అలాంటిది ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ పెట్టాలంటే మాత్రం భారీ బడ్జెట్‌తో కూడుకున్నది.

Airlines: దేశంలో ఎన్నో విమానయాన సంస్థలు ఉన్నాయి. సాధారణ వ్యాపారాలకే కోట్లు అవుతుంది. అలాంటిది ఒక ఎయిర్‌లైన్స్ సంస్థ పెట్టాలంటే మాత్రం భారీ బడ్జెట్‌తో కూడుకున్నది. దూర ప్రయాణాలు చేయడానికి కొందరు ఎక్కువగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఒక్కో విమానయాన సంస్థ సర్వీసులు ఒక్కోలా ఉంటాయి. వీటిలో ఛార్జీలు కూడా కాస్త వ్యత్యాసాలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది ధనికులు విమాన ప్రయాణం ఎంచుకుంటారు. సామాన్యుల్లో చాలా తక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎక్కువ శాతం మంది బాగా పాపులర్ అయిన ఎయిర్‌లైన్స్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ఎందుకంటే వీటికి రేటింగ్ మంచిగా ఉంటుందని, వీరి సర్వీసులు బాగుంటాయని ఫీల్ అవుతారు. అయితే ఒక్కో ఎయిర్ లైన్స్ ఎంతెంత వాటాను కలిగి ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇండిగో
దేశంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ బాగా పాపులర్ అయినదే. చాలా మంది వీటిని వాడుతుంటారు. అయితే దేశంలో ఈ ఎయిర్ లైన్స్ 65.2 శాతం ఉంది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌లైన్స్‌లో ఇదే టాప్ వాటా కలిగి ఉంది.
ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా రెండో ప్లేస్‌లో ఉంది. దేశంలోని ఈ ఎయిర్‌లైన్స్‌ను కూడా వాడుతుంటారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉంటాయని చాలా మంది ఎయిర్ ఇండియాకి కాస్త ప్రాధాన్యత ఇస్తారు. అయితే దేశంలో ఎయిర్ ఇండియా 25.7 శాతం వాటా కలిగి ఉంది.
ఆకాశ ఎయిర్
మూడో ప్లేస్‌లో ఆకాశ ఎయిర్ ఉంది. ఈ ఎయిర్‌లైన్స్ దేశంలో 4.7 శాతం వాటాను కలిగి ఉంది.
స్పైసీజెట్ ఎయిర్‌లైన్స్
ఈ ఎయిర్‌లైన్స్ 3.2 శాతం వాటాను కలిగి ఉంది.
ఏలియన్స్ ఎయిర్‌లైన్స్
ఈ ఏలియన్స్ ఎయిర్‌లైన్స్ 0.6 శాతం వాటాను కలిగి ఉంది.
స్టార్ ఎయిర్‌లైన్స్
దేశంలో స్టార్ ఎయిర్‌లైన్స్ 0.4 శాతం వాటాను కలిగి ఉంది.
ఫ్లై 91
దేశంలో ఈ ఎయిర్‌లైన్స్ కేవలం 0.1 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంది. మిగతా ఎయిర్‌లైన్స్ 0.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి.