PF Withdrawal: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం ఓకేసారి తీసుకునే ఛాన్స్
PF Withdrawal ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉపసంహరణ నిబంధనలు సులభతరం చేయడానికి సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.

PF Withdrawal: ప్రతి నెల జీతం పొందే ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఎందుకంటే ఇక పై ప్రావిడెంట్ ఫండ్ పొదుపులను ఉపసంహరించడానికి పదవీ విరమణ లేదా ఉద్యోగం కోల్పోయే వరకు ఎదరుచూడాల్సిన అవసరం లేదు. పీఎఫ్ చందా దారులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ మొత్తం కార్పస్ ను లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకునే అవకాశం పొందవచ్చు. ఈ మార్పు ఉద్యోగులకు తమ ఆర్ఠిక లక్ష్యాలను సాధించడంలో ఉపయోగపడుతుంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉపసంహరణ నిబంధనలు సులభతరం చేయడానికి సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ సభ్యులు తమ పూర్తి నిధులను ఉపసంహరించుకోవడానికి కొన్ని నిర్దిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో సాధరణంగా 58 సంవత్సరాల వయస్సులో రిటైర్మెంట్ తర్వాత లేదా రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగం ఉంటే, కొన్ని నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే అనుమతించబడేది.