PF: ఎంప్లాయిస్‌కు శుభవార్త.. ఇకపై యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా?

PF:
పీఎఫ్ ఖాతాదారులు డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు కొంతలో పర్లేదు. కానీ ఒకప్పుడు అయితే పీఎఫ్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి అలసిపోవడమే. కానీ డబ్బులు మాత్రం రావు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు ఎంతో ఇబ్బంది పడేవారు. దీంతో ఆన్‌లైన్‌లో డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో కొత్త రూల్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రూల్ కనుక వస్తే దేశంలోని ఖాతా దారులకు చాలా మేలు జరుగుతుంది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కొత్త రూల్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. పీఎఫ్ ఖాతాదారులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకునే విధంగా కొత్త రూల్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇదే కనుక జరిగితే ఈజీగా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం కేటాయించి అప్లై చేసుకోవడం, అక్కడికి చాలా రోజుల తర్వాత డబ్బులు వస్తాయి. అదే యూపీఐ ద్వారా అయితే ఎక్కువ రోజులు పట్టకుండా వెంటనే డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం అన్ని యూపీఐ ఫ్లాట్ ఫామ్స్ అన్నింటి ద్వారా కూడా ఈజీగా విత్ డ్రా చేసుకునేలా ఈపీఎఫ్‌ఓ ప్లాన్ చేస్తోంది. దీని కోసం ఈపీఎఫ్‌ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో చర్చలు జరుపుతోంది. ఈ కొత్త రూల్‌కి సంబంధించి ఈపీఎఫ్‌ఓ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసింది. త్వరలో ఈ కొత్త రూల్ వస్తుంది. ఈ రూల్‌తో ఈజీగా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌ఓ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం విత్ డ్రా ప్రక్రియను వేగవంతం చేయడం కోసమే. దీని ద్వారా తొందరగా డబ్బులు వస్తాయి. దీనివల్ల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఉద్యోగులకు డబ్బులు అవసరం అయినప్పుడు వెంటనే యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త రూల్ వస్తే మాత్రం కాస్త సైబర్ నేరాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు పీఎఫ్ ఖాతాదారులకు తెలియకుండా కొందరు డబ్బులు యూపీఐ ద్వారా విత్ డ్రా చేసే అవకాశం ఉంది. అయితే పీఎఫ్ డబ్బులు ఖాతాదారులు దేనికోసమైనా కూడా వినియోగించుకోవచ్చు. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లల వైద్య అత్యవసర పరిస్థితులు ఇలా దేనికోసమైనా కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఒక ఉద్యోగి కనీసం 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తేనే రుణం తీసుకోగలరు. అది కూడా వారి పీఎఫ్ అకౌంట్ నుంచి 90 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలి. మొత్తం విత్ డ్రా చేసుకోవడానికి కుదరదు.