Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Get Rs 200 British Beer For Just Rs 50 Now

Beer Prices : రూ. 50కే ఫారిన్ బీర్.. స్కాచ్, విస్కీ ధరలు తగ్గుతున్నాయోచ్

Beer Prices  : రూ. 50కే ఫారిన్ బీర్.. స్కాచ్, విస్కీ ధరలు తగ్గుతున్నాయోచ్
  • Edited By: rocky,
  • Updated on May 22, 2025 / 09:09 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Beer Prices : వేసవిలో బీర్ ప్రియులకు పండుగే పండుగ. ఇకపై దేశంలో అమ్ముడయ్యే బ్రిటన్ బీర్లు 75శాతం కంటే వరకు తక్కువ ధరకే లభించనున్నాయి. దీనికి కారణం భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన FTA (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం)లో భాగంగా దిగుమతి సుంకం (Import Duty) తగ్గించడం. ఈ డీల్ తర్వాత దేశంలో బ్రిటిష్ బీర్, స్కాచ్ ధరలు గణనీయంగా తగ్గుతాయి.

బ్రిటిష్ బీర్‌పై భారీగా తగ్గిన పన్ను
FTA ప్రకారం భారత్, బ్రిటన్ మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందంలో బ్రిటిష్ బీర్‌పై దిగుమతి సుంకాన్ని 150శాతం నుండి 75శాతానికి తగ్గించారు. దీనివల్ల బీర్ ప్రియులకు నేరుగా లాభం చేకూరనుంది. గతంలో రూ.200కు అమ్మబడే బ్రిటిష్ బీర్, ఇప్పుడు కేవలం రూ.50కే లభిస్తుందని తెలుస్తోంది. గత మూడు సంవత్సరాలుగా సాగిన చర్చల తర్వాతే ఈ దిగుమతి సుంకం తగ్గింపు జరిగిందని గమనించాలి. FTA కింద జరిగిన ఈ ఒప్పందంతో దేశంలో బ్రిటిష్ బీర్‌కు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also:Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు

స్కాచ్ విస్కీ, కార్లపై కూడా టాక్స్ తగ్గింపు
భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన FTA డీల్‌లో స్కాచ్ విస్కీపై విధించే దిగుమతి సుంకాన్ని కూడా సగానికి తగ్గించారు. అంతేకాదు, బ్రిటిష్ కార్లపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించారు. మరోవైపు, బ్రిటన్ భారతీయ వస్త్రాలు, తోలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

తక్కువ ధరకే లభించే బ్రిటిష్ బీర్ బ్రాండ్లు
భారతదేశంలో ఇప్పటికే చాలా బ్రిటిష్ బీర్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వాటి ధరలు 75 శాతం వరకు తగ్గుతాయి. కాబట్టి, ఇకపై బ్రిటన్‌కు చెందిన టెనెంట్స్ (Tennent’s), జాన్ స్మిత్ (John Smith’s), కోబ్రా (Cobra), న్యూకాజిల్ బ్రౌన్ ఏల్ (Newcastle Brown Ale), మార్స్టన్ (Marston’s) వంటి బీర్ బ్రాండ్లు గతంలో కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

Read Also:Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?

భారతీయ బీర్ బ్రాండ్‌లకు పోటీ
భారతదేశంలో సాధారణంగా ఎక్కువగా ఇష్టపడే బీర్ బ్రాండ్లలో కింగ్‌ఫిషర్ (Kingfisher), బిరా (Bira), హనీ కెన్ (Heineken), కార్ల్‌స్‌బర్గ్ (Carlsberg), కరోనా (Corona) వంటివి ఉన్నాయి. ఈ బీర్ బ్రాండ్ల ధర ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రూ.120 నుంచి రూ.150 మధ్య ఉంటుంది. గతంలో బ్రిటిష్ బీర్ బ్రాండ్లపై 150శాతం వరకు దిగుమతి సుంకం ఉండటం వల్ల అవి చాలా ఖరీదైనవిగా ఉండేవి. కానీ ఇప్పుడు దిగుమతి సుంకాన్ని 75శాతానికి తగ్గించడంతో, బ్రిటిష్ బీర్ కంపెనీలు భారతీయ బీర్ బ్రాండ్‌లతో పోటీ పడగలుగుతాయి. ఇది వినియోగదారులకు తక్కువ ధరలో మంచి నాణ్యత గల బీర్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.

Tag

  • Beer Prices
  • British Beer
  • Cheaper Beer
  • Import Duty
  • India-UK FTA
Related News
    Latest Photo Gallery
    • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us