Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు

Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ముందు కోపం వస్తుంది.. ఆ తర్వాత ఆగకుండా నవ్వు వస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి సరదా కోసం ఒక గాడిదను దారుణంగా కొడతాడు. కానీ, ఆ తర్వాతి క్షణమే సీన్ రివర్స్ అవుతుంది. ఆ గాడిదకు ఓపిక నశిస్తుంది. దీంతో ఆ గాడిద ఆ వ్యక్తికి జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది.
మూగజీవి తిరుగుబాటు
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి గాడిదను దారుణంగా కొట్టడం చూడొచ్చు. అతను ఆ మూగజీవి నోటిపై చెంపదెబ్బలు కొడతాడు.. పిడిగుద్దులు గుద్దుతాడు. పాపం, ఆ గాడిద మాత్రం మౌనంగా కాసేపు అంతా భరిస్తూ ఉంటుంది. కానీ, తర్వాతి క్షణమే ఏదో జరిగి ఆ వ్యక్తి నొప్పితో విలవిలలాడిపోతాడు.
Read Also : Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?
— People getting kill*d daily🔞 (@KnowIedg3) May 19, 2025
వీడియోలో చూస్తే ఆ మూగజీవిని దారుణంగా కొట్టిన తర్వాత ఆ వ్యక్తి దానిపై ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆట మారిపోతుంది. ఆ గాడిద అతని కాలును తన దంతాలతో గట్టిగా పట్టుకుని నేలపై ఈడ్చడం మొదలుపెడుతుంది. అంటే, కొన్ని క్షణాల ముందు ఆ జంతువును దారుణంగా కొట్టిన వ్యక్తి, తర్వాతి క్షణమే సహాయం కోసం అరుస్తూ కేకలు వేయడం మొదలుపెట్టాడు.
నెటిజన్ల రియాక్షన్
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో @KnowIedg3 అనే హ్యాండిల్ షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు లక్ష సార్లకు పైగా చూశారు. కామెంట్ సెక్షన్లో ప్రజలు ఆ వ్యక్తిని తెగ ఏడిపిస్తున్నారు. ఒక నెటిజన్ “గాడిద ఎంత అద్భుతంగా ప్రతీకారం తీర్చుకుందో!” అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ “దీన్నే కర్మ అంటారు!” అని రాశారు. ఇంకొక నెటిజన్ “ఆ వ్యక్తికి ఈ శిక్ష పడాల్సిందే!” అని అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్, “ఆ జంతువు ఆ వ్యక్తికి చుక్కలు చూపించింది!” అని రాశారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలను హింసించేవారికి ఇది ఒక గుణపాఠం అని అంటున్నారు.
Read Also : Bajaj Auto : బజాజ్ ఆటో చరిత్రలో కొత్త మలుపు.. 7,765 కోట్ల డీల్..కేటీఎం చేజిక్కించుకోనున్న భారతీయ దిగ్గజం
-
Viral Video : డిక్కీలో 50క్వార్టర్ బాటిళ్లు.. స్కూటీలో ఏకంగా వైన్ షాపే పెట్టాడుగా
-
Viral Video : గుర్రం ఒక్క కిక్ ఇచ్చింది.. దెబ్బకు పరుగులంకించుకున్న పిట్ బుల్
-
Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
-
Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు
-
Viral Video : వీడికి రెండు గుండెలున్నాయా భయ్యా.. ప్రాణం పోతున్నా వీడియో తీశాడు
-
Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?