Personal Loan : వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకపోతే భారీగా నష్టపోతారు..
Personal Loan : చాలామంది వ్యాపారం కోసం డబ్బులు అవసరం అయితే పర్సనల్ లోన్ తీసుకోవాలని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అది అంత సులభమైన పని కాదు.

Personal Loan : పర్సనల్ లోన్ తీసుకోవడానికి ముందు మీరు ఆలోచించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది తమకు ఏ అవసరం వచ్చినా కూడా పర్సనల్ లోన్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా చాలామంది మెడికల్ బిల్లులు, ఎడ్యుకేషన్ ఫీజులు, బిజినెస్ ఎక్స్పాన్స్ అండ్ వంటి వాటికోసం పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిజినెస్ కోసం డబ్బులు అవసరం అయితే చాలామంది పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది అంతా ఈజీ కాదని తెలుస్తుంది. అటువంటి వాళ్ళు లోన్ అప్లై చేయడానికి ముందే కొన్ని కీలకమైన అంశాలను పరిశీలించాలి. వీటిని తెలుసుకోకపోతేl ఒక ప్లస్ విషయం ఏమిటంటే ఆ లోన్ డబ్బులను వాళ్ళు త్వరగా పొందగలరు. పెద్దగా పేపర్ వర్క్ కూడా అవసరం ఉండదు. బిజినెస్ లోన్ లాగా పర్సనల్ లోన్ కు అప్రూవల్ కి ఎక్కువ సమయం కూడా అవసరం ఉండదు. కొన్ని గంటల్లోనే పర్సనల్ లోన్ అప్రూవ్ అవుతుంది. బిజినెస్ కు వెంటనే డబ్బులు అవసరం అయితే రోజువారి ఖర్చులను కవర్ చేసుకోవడానికి లేదా ఆకస్మిక అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి పర్సనల్ లోన్ ద్వారా వెంటనే డబ్బు చేతికి అందుతుంది. చాలాకాలం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పర్సనల్ లోన్ ఆర్థికంగా కాపాడుతుంది.
కొన్ని పర్సనల్ లోన్స్ కు కోలేటరల్ సెక్యూరిటీ కూడా అడగరు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ వీటిపై ఎక్కువ వడ్డీ రేటులను వసూలు చేస్తారు. ఈ క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10.85% నుంచి 24%, ఐసిఐసిఐ బ్యాంకు 10.85% నుంచి 16.65%, ఎస్బిఐ బ్యాంక్ 12.60%నుంచి 14.60%, బ్యాంక్ ఆఫ్ బరోడా 12.15% నుంచి 18.50%, యూనియన్ బ్యాంక్ 11.50% నుంచి 15.20% రేట్లతో లోన్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు క్రెడిట్ స్కోర్ మరియు లోను టెన్యూర్ ఆధారంగా చేసుకొని వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.
అయితే పర్సనల్ లోన్ కోసం వీటికంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి రీపేమెంట్స్ రూల్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత క్రెడిట్ స్కోర్ ను పర్సనల్ లోన్లు ప్రభావితం చేస్తాయి. ప్రతినెల సకాలంలో డబ్బులు చెల్లిస్తే స్కోరు మెరుగుపడుతుంది. లేకపోతే స్కోరు దెబ్బ తినే అవకాశం ఉంది. తక్కువ క్రెడిట్ స్కోరు భవిష్యత్తులో లోన్ లేదా క్రెడిట్ కార్డులను పొందే అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వాళ్లకు ఇది పెద్ద సమస్యగా తయారవుతుంది.