Pi coin: పై కాయిన్‌ను ఇండియన్స్ కొనవచ్చా? ఇందులో పెట్టుబడులు పెట్టడం ఎలా?

Pi coin:
క్రిప్టో కరెన్సీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హవా కొనసాగుతోంది. చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ కరెన్సీని కొనుగోలు చేస్తే భవిష్యత్తలో మంచి లాభాలను తెచ్చి పెడుతుందని చాలా మంది వీటి వైపు మొగ్గు చూపుతుంటారు. ఈ క్రిప్టో కరెన్సీని ఎక్కువగా విక్రయిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ అంటే ఇది ఒక డిజిటల్ కాయిన్. అయితే దీని నుంచే పై కాయిన్ అనే ఒక డిజిటల్ కాయిన్ వచ్చింది. ఈ పై కాయిన్ అనేది బ్లాక్ చైన్‌తో సృష్టించినది అయితే కాదు. స్మార్ట్ ఫోన్ మైనింగ్ ద్వారా ఈ డిజిటల్ కాయిన్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఈ పై కాయిన్‌కి ఆదరణ బాగానే పెరుగుతుంది. అయితే ఈ పై కాయిన్‌ను ఇండియన్స్ కొనుగోలు చేయవచ్చా? పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
స్మార్ట్ ఫోన్ మైనింగ్ ద్వారా ఈ పై కాయిన్‌ను సృష్టించారు. అయితే దీన్ని క్లోజిడ్ నెట్‌వర్క్ అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ పై కాయిన్ ఎన్‌క్లోజిడ్ మెయిన్‌నెట్ ద్వారా పనిచేస్తుంది. అయితే ఇది పబ్లిక్ ఎక్స్చేంజిలలో ట్రేడ్ చేసేందుకు రెడీగా అయితే లేదు. దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు స్మార్ట్ ఫోన్‌లో పై నెట్‌వర్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మైనింగ్ చేయాలి. అయితే ఈ కాయిన్ మైనింగ్ కోసం మీరు మొబైల్ బ్యాటరీ వాడితే సరిపోతుంది. ఈ పై కాయిన్‌ను కొనుగోలు చేయడమే. దీన్ని అధికారికంగా ఎక్కడా కూడా వినియోగించలేరు. కాయిన్ బేస్ లాంటి ఎక్స్చేంజిల్లో లిస్ట్ అయితేనే ఈ పై కాయిన్ చలామణిలోకి వస్తుంది. అయితే దీన్ని చలామణీలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తుంది. పై కాయిన్ కోసం కొన్ని క్రిప్టో కరెన్సీలు ఎక్స్‌చేంజీల ఫారంలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే పైకాయిన్ ధర లిస్టింగ్ టైమ్‌లో ధర రూ.1.97 డాలర్లు పలికేది. కానీ ప్రస్తుతం దీని ధర బాగా పడిపోయింది. ప్రస్తుతం పై కాయిన్ ధఱ రూ.0.73 డాలర్లకు పడిపోయింది. అయితే భారతీయలు ఈ పై కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. అయితే భారతీయుల కూడా ఈ కాయిన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీన్ని కాయిన్ డీసీఎక్స్ వంటి క్రిప్టో కరెన్సీ ద్వారా ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయాలి. దీని కోసం మీరు ఒక వాలెట్ అకౌంట్ సృష్టించాలి. ఆ తర్వాత కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే మీరు కొనుగోలు చేయగలరు. ఇలాంవి ఫేక్‌వి కూడా ఉంటాయి. కాబట్టి ఇతరుల మాయలో పడి మోసపోవద్దు. ఈ కరెన్సీని కొనుగోలు చేసేటప్పుడు కాస్త తెలుసుకుని కొనడం ఉత్తమం.