Tejeshwar Case: తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు
Tejeshwar Case విచారణలో తిరుమల రావు ఐశ్వర్యపై అనుమానంతో ఆమె స్కూటీకి జీపీఆర్ఎస్ అమర్చినట్లు తేలింది. ఐశ్వర్య కదిలికలను నిరంతరం ట్రాక్ చేయడానికి తిరుమల రావు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

Tejeshwar Case: గద్వాల్ లో తేజేశ్వర్ హత్య కేసును పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో తిరుమల రావు ఐశ్వర్యపై అనుమానంతో ఆమె స్కూటీకి జీపీఆర్ఎస్ అమర్చినట్లు తేలింది. ఐశ్వర్య కదిలికలను నిరంతరం ట్రాక్ చేయడానికి తిరుమల రావు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
తేజేశ్వర్ హత్య వెనుక ఐశ్వర్య ఒత్తిడి ఉందని విచారణలో వెల్లడైంది. ఐశ్వర్య బలవంతం చేయడంతో తిరుమల రావు సుపారీ గ్యాంగ్ తో తేజేశ్వర్ ను హత్య చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఐశ్వర్యకు తిరుమల రావుతో పాటు మరో ఇద్దరితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కోణలో పోలసులు విచారణ చేస్తున్నారు.