Bhagavad Gita Chant: భగవద్గీత శ్లోకంతో రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ముద్ర.. కేన్స్‌లో మెరిసిన అందాల తార ఐశ్వర్య
ఫ్రాన్స్‌లో మే 13వ తేదీన ప్రారంభమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంతర్జాతీయ వేడుకలో ఎంతో మంది సినీ ప్రముఖులు, గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొనప్పటికీ, అందరి చూపులు మాత్రం ఒకప్పటి మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మీదే ఉన్నాయి.

Bhagavad Gita Chant : ఫ్రాన్స్‌లో మే 13వ తేదీన ప్రారంభమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంతర్జాతీయ వేడుకలో ఎంతో మంది సినీ ప్రముఖులు, గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొనప్పటికీ, అందరి చూపులు మాత్రం ఒకప్పటి మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మీదే ఉన్నాయి. ఆమె రాక కోసం ఎదురుచూసిన అభిమానులకు, ఫ్యాషన్ ప్రియులకు నిరాశ ఎదురవ్వలేదు. ఐశ్వర్య రాయ్ ఈ సారి కూడా తనదైన శైలిలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగు పెట్టి, అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Read Also: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు
కేన్స్ వేదికపై ఐశ్వర్య తొలి లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సంప్రదాయ భారతీయ చీరకట్టులో, సింధూరంతో అడుగుపెట్టింది. ఐవరీ రంగులో ఉన్న ఆ చీర ఐశ్వర్యకు ఎంతో హుందాతనాన్ని తెచ్చింది. ఇది కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయానికి ఆమె ఇచ్చిన గౌరవం. దానిని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ఆమె ఆకాంక్షను చాటి చెప్పింది. ఈ లుక్‌లో ఆమె కుమార్తె ఆరాధ్య కూడా ఆమెతో పాటు కనిపించింది.
ఐశ్వర్య రాయ్ రెండో లుక్ మరింత సంచలనం సృష్టించింది. ఆమె బ్లాక్ షిమ్మరీ బాడీకాన్ గౌన్‌ను ధరించింది. దానికి తోడు ఒక అద్భుతమైన కేప్‌ను జతచేసింది. ఈ లుక్ ఆమెకు ఒక రాయల్, స్టైలిష్ లుక్ ఇచ్చింది. అయితే, ఈ లుక్‌లో అందరి దృష్టి ఆమె కేప్‌పైనే నిలిచిపోయింది. దీని వెనుక ఉన్న ప్రత్యేకతను తెలుసుకున్న వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఈ ప్రత్యేకమైన దుస్తులను రూపొందించారు. తాజాగా, గౌరవ్ గుప్తా ఐశ్వర్య ఫోటోలను షేర్ చేస్తూ.. ఆమె డ్రెస్ వివరాలను వెల్లడించారు. ఐశ్వర్య ధరించిన కేప్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రత్యేకంగా తయారు చేశారు. దానిపై అత్యంత నైపుణ్యంతో కూడిన బ్రోకేడ్ పని (బంగారం లేదా వెండి దారాలతో చేసే ఎంబ్రాయిడరీ) జరిగింది. ఈ కేప్ ప్రత్యేకత ఏమిటంటే దానిపై శ్రీమద్భగవద్గీతలోని ఒక సంస్కృత శ్లోకం రాసి ఉంది.
Read Also: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా డిజైన్ చేసి దుస్తులులో ఐశ్వర్య రాయ్ తనదైన ముద్ర వేయగలిగింది. ఆమె తన లుక్‌ను ‘హెయిరెస్ ఆఫ్ క్లామ్’ అనే థీమ్‌తో రూపొందించుకుంది. వారణాసి నుంచి ఫ్రాన్స్ వరకు ఉన్న దూరం 7,216 కిలోమీటర్లు. అంటే, భారతదేశంలోని పవిత్ర నగరం వారణాసి నుండి ఒక కళాకృతిని కేన్స్ వంటి ప్రపంచ వేదికకు తీసుకురావడం ఒక అద్భుతమైన విషయం.
-
No Theatre Shutdown: థియేటర్ల బంద్ లేదు.. జూన్ 1 నుంచి యథావిధిగా సినిమా ప్రదర్శనలు
-
Song Release: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్‌స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?