Song Release: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
ఏపీ డిప్యూటీ సీఎం తాజాగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఈ సినిమా భారీ అంచనాలతో జూన్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కళ్యాణ్ అభిమానులు ఇప్పటి వరకు క్యారెక్టర్లో సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి అవాంతరాలే వస్తున్నాయి.

Song Release: ఏపీ డిప్యూటీ సీఎం తాజాగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఈ సినిమా భారీ అంచనాలతో జూన్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. కళ్యాణ్ అభిమానులు ఇప్పటి వరకు క్యారెక్టర్లో సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి అవాంతరాలే వస్తున్నాయి. సినిమాకి పవన్ కళ్యాణ్ సైన్ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. దీంతో వీటి ప్రచారం, ఆ తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. దీంతో బిజీగా మారారు. షూటింగ్‌కు కూడా సమయం లేకపోవడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే నెలలో మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హరి హర వీరమల్లు నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 11:55 గంటలకు హరి హర వీరమల్లు నుంచి ధర్డ్ సాంగ్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
Read Also: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ బిజీలో ఉన్నారు. అయితే ఈ మూడో పాట పవన్ కళ్యాణ్‌కి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పూర్తి చేసుకొని హరి హర వీరమల్లు చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి(MM Keeravani) ఇంటికి వెళ్లారు. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కృతఙ్ఞతలు తెలియజేసి సన్మానం చేశారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కీరవాణితో మాట్లాడారు. ఈ సందర్భంగా పాట బాగా నచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ పాటను 50 సార్లు విని ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అసలు పూర్తిగా పౌరుషం లేని వారికి ఈ పాట వినిపిస్తే చాలు.. పూనకాలు వస్తాయని చెప్పారు. అయితే హరి హర వీరమల్లు నుంచి మూడో పాట బీట్‌లో ఉంటుందని తప్పకుండా హిట్ అవుతుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 50 సార్లు పాటను విన్నారంటే ఆ పాట ఏ రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించవచ్చు.
ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కీరవాణిని ‘ఆస్కార్ అవార్డు ఎక్కడ సార్’ అని అడిగారు. దీనికి కీరవాణి రెస్పాండ్ అవుతూ.. ‘ఇక్కడ ఆస్కార్ ఉంటే అది నన్ను డామినేట్ చేస్తుందని లోపల పెట్టానని కీరవాణి అన్నారు. మీ చేతుల మీదుగా మళ్లీ రెండోసారి ఆస్కార్ తీసుకోవాలని ఉందని కీరవాణి అంటారు. వెంటనే పవన్ చేతుల మీదుగా కీరవాణి రెండోసారి ఆస్కార్‌ను తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు వాయిదాలు పడిన హరి హర వీరమల్లు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ బీట్ సాంగ్‌లతో పవన్ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేస్తారని అనిపిస్తోంది.
-
No Theatre Shutdown: థియేటర్ల బంద్ లేదు.. జూన్ 1 నుంచి యథావిధిగా సినిమా ప్రదర్శనలు
-
Bhagavad Gita Chant: భగవద్గీత శ్లోకంతో రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ముద్ర.. కేన్స్‌లో మెరిసిన అందాల తార ఐశ్వర్య
-
Elephants: ఆ ఏనుగుల బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్స్క్రిప్షన్