Tamil Nadu: తమిళనాడులో భార్య చేతిలో భర్త బలి
Tamil Nadu వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు.

Tamil Nadu: భార్య చేతిలో భర్త బలైన ఘటన తమిళనాడులో జరిగింది. వేలూరు జిల్లా ఒడుకత్తూర్ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలోని ఓ హోటల్లో వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కింద బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో వివాహమైంది. వారాంతపు సెలవు రోజుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్ ఇంటికొస్తుంటాడు. ఈనెల 21 ఇంటికొచ్చిన భారత్..సరుకుల కోసం భార్య, చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనం పై దుకాణానికి వెళ్లాడు.
తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి భారత్ పై దాడి చేశాడు. దీంతో భారత్ ప్రాణాలు విడిచాడు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సందేహం వచ్చింది. నందినికి ఎదురింట్లో ఉండే 21 ఏళ్ల సంజయ్ తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో భారత్ ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం వేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.