Tamil Nadu: తమిళనాడులో మునిగిపోయిన దేశం.. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అంటే?

Tamil Nadu: పురాతన కాలంలో ఎన్నో గ్రామాలు, ప్రాంతాలు, దేశాలు మునిగిపోయి ఉన్నాయి. అయితే ఇలానే తమిళనాడులో కూడా ఓ దేశం మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ దేశం కొన్ని వేల సంవత్సరాల కింద సముద్రంలో మునిగిపోయింది. ఎన్ని వేల సంవత్సరాలు అని కచ్చితంగా అయితే శాస్త్రవేత్తలు గుర్తించలేదు. సుమారుగా 15 వేల సంవత్సరాల కిందట సముద్రంలో ఈ దేశం మునిగిపోయిందని అంటున్నారు. చెన్నై మెరీనా బీచ్‌కి సమీపంలో ఉందని అంటున్నారు. అయితే ప్రపంచంలో ప్రాచీన నగరంగా జెరికోకు పేరు ఉంది. ఇది ఇజ్రాయెల్‌లో ఉంది. అయితే చెన్నై ఓషన్ యూనివర్సిటీ దీని కోసం పరిశోధనలు జరిపింది. ఈ క్రమంలో తమిళనాడు కోస్తా తీరంలోకి రెండు నౌకలను పంపింది. సాగర్ ధార, సాగర్ అన్వేషిక అనే రెండు ఓడలను పరిశోధనల కోసం పంపింది. అవి సముద్రంలోని లోతు వరకు వెళ్లాయి. అక్కడ మట్టిని తవ్వి మరి పరిశోధనలు జరిపాయి. వీటి కోసం అద్భుతమైన టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఈ రెండు నౌకలు కూడా పుదుచ్చేరి పుంపుహార్ వరకు వెళ్లాయి. అయితే పుంపుహార్ ఇప్పుడు ఒక సాధారణ నగరం. అయితే ఇక్కడ తమిళనాడు ప్రాచీన వారు నివసించినట్లు తెలుస్తోంది. దీనికి కొన్ని కిలోమీటర్ల సమీపంలో పరిశోధనలు చేశాయి. సముద్రానికి కొన్ని కిలోమీటర్ల లోతులో ఇళ్లు, నౌకాయానం, లైట్ హోస్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ పుంపుహార్ గురించి కొన్ని ప్రాచీన గంధాల్లో కూడా రాసి ఉంది. అయితే సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. వచ్చే కొన్ని ఏళ్లలో కూడా సముద్ర తీర ప్రాంతాలు అన్ని కూడా సముద్రంలో కలిసిపోతాయి. ఈ పుంపుహార్ కూడా సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండేది. ఈ సముద్ర మట్టానికి రెండు వేల వరకు తక్కువగా ఉండేదట. ఈ క్రమంలోనే మునిగిపోయినట్లు గుర్తిస్తున్నారు. ఈ పుంపుహార్‌లో ప్రహారీ గోడలు ఉన్న ఇళ్లు కనిపించాయి. అయితే ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయో వాటి సంవత్సరం తెలియలాంటే మాత్రం పరిశోధనలు జరగాయి. ఇవి పూర్తి అయిన తర్వాత వీటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: షూటింగ్ మొదటి రోజే లయను వద్దు అనేసిన బాలయ్య.. విషయాలు బయటపెట్టిన లయ
తమిళ సంగం సమయంలో రెండు కావ్యాలు రచించారు. వీటిలో ఈ పుంపుహార్ గ్రామం గురించి వివరించి ఉంది. వీటిని 2000 వేల సంవత్సరాల కిందట రచించారు. అలాగే గ్రీకు గ్రంధాల్లో కూడా ఉంది. అయితే కావేరి నది తంజావూర్ సమీపంలో ఉంది. అలాగే బుద్ధ దత్తుడు కూడా ఓ రచన రాశాడు. ఇందులో కావేరి నది కోసం ప్రస్తావించాడు. ఇప్పుడు అయితే కావేరి నదిలో పెద్దగా నీరు లేవు. కానీ అప్పుడు కావేరి నది మంచిగా ఉందని అంటున్నారు. అయితే అప్పట్లో ఎందరో గ్రీకు వ్యాపారులు కావేరి, పుంపుహార్ పట్టణాల దగ్గర సేద తీరేవారు. అయితే ఇప్పుడు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ పుంపుహార్ పట్టణం సునామీ వల్ల సముద్రంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువగా మోసాలు వంటివి జరగడం వల్ల సముద్రం ఇలా తీసుకుందని అంటున్నారు. అయితే ఈ పుంపుహార్ గురించి పూర్తి వివరాలు కూడా పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే వీటి వివరాలు తెలియనున్నాయి.