Civils Preparation: ఇలా ప్రిపేర్ అయితే.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ మీ సొంతం
Civils Preparation యూపీఎస్సీకి ప్రతీ ఏడాది కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఏడాది మే 25వ తేదీన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందులో అర్హత సాధిస్తేనే.. మెయిన్స్ పరీక్ష రాయగలరు.

Civils Preparation: దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష ఏదంటే.. అందరి నోట ఫస్ట్ వినిపించేది.. సివిల్స్. ఇందులో అర్హత సాధించాలంటే చాలా కష్టం. సివిల్స్ ఉద్యోగం సాధించాలని చాలా మంది కలలు కంటారు. ఈ ఉద్యోగం కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడుతుంటారు. కోచింగ్‌లు తీసుకుని.. ఇష్టమైన వాటిని కూడా దూరం పెట్టి మరి చదువుతుంటారు. అయితే సివిల్స్ నోటిఫికేషన్ ప్రతీ సంవత్సరం కూడా ఉంటుంది. ఎన్నో లక్షల మంది వీటికి అప్లై చేస్తే కేవలం కొందరు మాత్రమే ఈ పరీక్షకు అర్హత సాధిస్తారు. సివిల్స్ పరీక్ష ఒక్కసారికే సాధించాలంటే చాలా కష్టం కూడా. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి ప్రిపరేషన్ ఉండాలి. అయితే సరిగ్గా ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకుంటేనే.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ కొట్టగలరు. లేకపోతే సివిల్స్ కొట్టడం అసాధ్యం. సరిగ్గా ప్లాన్ చేసుకుని, దానికి తగ్గట్లు చదివితేనే కోరుకున్న సివిల్స్ జాబ్ వస్తుంది. అయితే ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఉద్యోగం సాధించవచ్చో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ యూపీఎస్సీకి ప్రతీ ఏడాది కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఏడాది మే 25వ తేదీన యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందులో అర్హత సాధిస్తేనే.. మెయిన్స్ పరీక్ష రాయగలరు. అయితే ప్రిలిమ్స్‌కు సరిగ్గా నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. మీరు ఈ సమయంలో సరిగ్గా ప్రిపేర్ అయితే మాత్రం తప్పకుండా అర్హత సాధించగలరు. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ (GS) పేపర్-1, CSAT పేపర్-2 (క్వాలిఫైయింగ్) అని ఉంటాయి. మొదటి పేపర్లో మెరిట్ రావాలి. రెండో పేపర్లో క్వాలిఫైయింగ్ వచ్చినా సరిపోతుంది. అయితే పేపర్ 1ను 2 గంటల పాటు 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, పర్యావరణం, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఒక్కో తప్పు ప్రశ్నలకు 1/3 మార్కులు తగ్గిస్తారు. ఇందులో ఎక్కువ స్కోర్ సాధించాలి. అయితే పేపర్ 2 కూడా పేపర్ 1లాగే ఉంటుంది. ఇందులో రీజనింగ్, మ్యాథమెటిక్స్, కాంప్రహెన్షన్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు తగ్గిస్తారు. అయితే ఇందులో కనీసం 66 మార్కులు రావాలి.
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు ఎక్కువ సమయం లేదు. అయితే కేవలం నెల రోజుల్లోనే మీరు చదవాలి అంటే.. రోజుకి 10 నుంచి 12 గంటల వరకు చదవాలి. ఇలా చదివినప్పుడే మీరు మొత్తం సిలబస్‌ను పూర్తి చేయగలరు. ఉదయం కొన్ని సబ్జెట్ట్లు, సాయంత్రం కొన్ని సబ్జెట్ట్లు చదవాలి. అయితే ఏ సమయంలో చదివితే మీకు ఇష్టమో.. దాని బట్టి ప్లాన్ చేసుకోవాలి. కేవలం చదవడం మాత్రమే కాకుండా చదివింది రాసుకోవాలి. అప్పుడే మీకు చదివింది అంతా కూడా గుర్తు ఉంటుంది. గత పరీక్షల పేపర్లను కూడా చదవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా.. సిలబస్ పేపర్ బట్టి చదవాలి. ఇలా చదివితేనే మీరు ప్రిలిమ్స్‌కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.