PGECET Lawcet Counselling: పీజీఈసెట్, లాసెట్, పీసీఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూళ్లు
PGECET Lawcet Counselling పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి, పీజీ ఎల్ కౌన్సెలింగ్ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

PGECET Lawcet Counselling: తెలంగాణలో లా కాలేజీల్లో ఎల్ ఎల్ బీ సీట్ల భర్తీకి లాసెట్, ఎల్ ఎల్ ఎం మాస్టర్ కోర్సుల్లో చేరేందుకు పీజీ ఎల్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ మూడిండింటికి సంబంధించిన షెడ్యూల్ ను విద్యామండలి శనివారం విడుదల చేసింది.
పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి, పీజీ ఎల్ కౌన్సెలింగ్ ఆగస్టు 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీ సమావేశాలు నిర్వహించి.. ఈ మేరకు షెడ్యూల్ లను ఖరారు చేశారు.