3BHK movie full review: 3BHKతో హీరో సిద్దార్థ్ మరోసారి హిట్ కొట్టాడా?

3BHK movie full review: తమిళంలో వచ్చిన ప్రతి సినిమా డబ్ అవుతుంది. కొన్ని సినిమాల్లో తమిళంలో తెలుగులోనే హిట్ అవుతాయి. తమిళ హీరో అయినా సిద్దార్థ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటించిన 3BHK మూవీ నేడు థియేటర్లో రిలీజ్ అయింది. అయితే మధ్య తరగతి ఫ్యామిలీస్ కి అనుగుణంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మరి సిద్ధార్థ నటించిన మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం
కథ
కథ విషయానికి వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు కొనుక్కోడానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని క్లియర్ గా చూపించారు. ఇందులో శరత్ కుమార్ నటించగా సిద్దార్థ్ కొడుకుగా నటించాడు. 3BHK ప్లాట్ ని కొనడానికి వీళ్ళు ఏం చేశారనేది సినిమాలో చూపించారు. మంచి ఉద్యోగం సాధించాలని పట్టుదలతో సిద్దార్థ్ ఉంటాడు. కానీ ఉద్యోగం రాదు. మరి వీరు 3BHK ఫ్లాట్ కొన్నారా? ఆ ఫ్లాట్ కోసం ఏం చేశారు? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
దర్శకుడు గణేష్ కేవలం మిడిల్ క్లాస్ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని సినిమా తీశాడు. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు ఒక ఇల్లు కొనడానికి ఎంతగానో కష్ట పడుతుంటారు. ఈ పాయింట్ మీద గణేష్ సినిమా మొత్తాన్ని తీశారు. అయితే సినిమా ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటుంది. సన్నివేశం ప్రేక్షకులకు హత్తుకునేలా ఉంటుంది. ఏం చెప్పాలంటే కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇంటర్వెల్ తర్వాత అయితే సిద్దార్థ్ శరత్ కుమార్ ఇద్దరి మధ్య వచ్చే సీన్ కి ప్రతి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతాడు. చిన్న మొత్తం కూడా ఫ్యామిలీ జోనర్ లో ఉంటుంది. ఎమోషనల్ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దీనివల్ల ప్రేక్షకులకు మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. కథ మొత్తం డబ్బులు, ఇంటి చుట్టే తిరుగుతుంది.
నటీనటుల నటన
ఈ సినిమాలో సిద్ధార్థ్ చాలా చాలా బాగా నటించాడు. మిడిల్ క్లాస్ వారు ఎలా ఉంటారో అలానే కనిపించాడు. అలాగే పాత్రలో నటించిన శరత్ కుమార్ కూడా అద్భుతంగా నటించారు. మూవీ మొదటి నుంచి చివరి వరకు ఇదే మెయింటైన్ చేశారు. ఒక నాన్న కుటుంబానికి కావాల్సిన వాటి కోసం ఎంత కష్టపడతారో అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. దేవాయని తల్లి పాత్రలో ఒదిగిపోయింది. మిగతావారు కూడా వారు పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
మూవీకి మ్యూజిక్ బాగుందని చెప్పొచ్చు. అమృత్ రామ్ నాథ్ అందించిన బిజిఎం ఎమోషనల్ సీన్స్ కి బాగా సెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విజువల్స్, డిజైన్ అన్ని కూడా సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. టెక్నికల్ గా అయితే సినిమా చాలా బాగుంది అని చెప్పొచ్చు
ప్లస్ పాయింట్స్
కథ
సిద్దార్థ్ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
సాగదీత
అనవసరమైన సీన్స్
రేటింగ్- 2.25/5