Hero Siddharth-aditi rao hydari: సిద్ధార్థ్, అదితి న్యూ యాడ్ చూశారా.. పెళ్లి తర్వాత కలిసి చేసిన ఫస్ట్ షూట్ ఇదేనేమో!

Hero Siddharth-aditi rao hydari:
హీరో సిద్ధార్థ్, అదితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించుకుంటున్న వీరు ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంటారు. అన్ని విషయాలపై స్పందిస్తూ.. పోస్టులు కూడా పెడుతుంటారు. అయితే పెళ్లయిన తర్వాత సిద్ధార్థ్, అదితి కలిసి ఓ బ్యూటీ బ్రాండ్ యాడ్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రపంచంలో నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ అయిన L’Oréal Paris డిజిటల్ యాడ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీనిలో భాగంగా అదితి రావు హైదరి, సిద్దార్థ్ నటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫన్ రీల్ చేస్తూ క్యూట్‌గా ఇద్దరు కనిపించారు. ఈ యాడ్‌లో భాగంగా దుమ్ము, చెమట, తలపై నూనె పెరిగి జిడ్డుగా హెయిర్ మారుతుందని ఈ సమస్య తగ్గాలంటే L’Oréal Paris Hyaluon Pure Shampoo వాడాలని చెప్పారు.
View this post on Instagram
మధ్యలో అదితి వచ్చి ఈ షాంపూ వాడితే సమస్య తగ్గుతుందని సిద్ధార్థ్‌కి సలహా ఇస్తుంది. ఇందులో శాలిసిలిక్ ఆసిడ్, హయాలురోనిక్ వంటి యాసిడ్లు ఉన్నాయని, ఇవి జట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ L’Oréal Paris Hyaluon Pure Shampoo నూనె పేరుకుపోవడాన్ని తగ్గించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని సిద్ధార్థ్ దీన్ని ప్రమోట్ చేశారు. ఈ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లయిన తర్వాత ఇద్దరూ కలిసి ఇలా యాడ్ చేయడం ఇదే మొదటిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి యాడ్ బాగా చేశారని, క్యూట్ లుక్స్‌లో ఎంతో అందంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
హీరో సిద్ధార్థ్, అదితి మహా సముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. 2021లో ఈ సినిమా వచ్చింది. దీని కంటే ముందే సినిమా షూటింగ్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. సిద్ధార్థ్ అదితిని ప్రపోజ్ చేయడంతో వారి ప్రేమ, పెళ్లిగా మారింది. గతేడాది సెప్టెంబర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అదితికి ఇష్టమైన ప్లేస్‌లో తనకి ప్రపోజ్ చేసినట్లు గతంలో తెలిపింది. తన అమ్మమ్మ స్కూల్‌లో తనికి ప్రపోజ్ చేశాడట. ఈ స్కూల్ అంటే అదితికి ఎంతో ఇష్టం. ఈ విషయం తెలుసుకుని, అక్కడికి తీసుకెళ్లమని అడిగి ప్రపోజ్ చేశాడు. స్కూల్‌లో చేయడం వల్ల వారి అమ్మమ్మ ఆశీస్సులు కూడా అందుతాయని సిద్ధార్థ్ ఇలా చేశాడట. వీరు వివాహం కూడా వనపర్తిలోని ఆలయంలో కొద్ద మద్ది సమక్షంలో చేసుకున్నారు. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా వీరి వివాహం జరిగింది.