71th National Film Awards: జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్
71th National Film Awards ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ జీవించిన లైఫ్ టైమ్ పెర్ఫామెన్స్ కూడా బహుమతుల జాబితాలో లేకపోవడం ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగించింది.

71th National Film Awards: జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్ అయ్యారు. ఈ అవార్డుల ఎంపిక పై సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలకూ, అవార్డుల జాబితాలో నిలిచే అవకాశమున్న నటీనటులకూ గుర్తింపు రాకపోవడం చూసి ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు.
ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ జీవించిన లైఫ్ టైమ్ పెర్ఫామెన్స్ కూడా బహుమతుల జాబితాలో లేకపోవడం ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగించింది. 12TH ఫెయిల్, సామ్ బహుదూర్ వంటి సినిమాల్లో నటీనటుల ప్రదర్శన కూడా మెచ్చుకోదగినదే అయినప్పటికీ, అవార్డుల కూర్చీ దగ్గర దృష్టిలో పడకపోవడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డుల ఎంపికలు నిజంగా న్యాయంగా జరిగాయా లేక ప్రాసెస్ లో బలమైన కారణం ఉందా అనే డౌట్లు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి.