Ajith: దాదాపు 25 ఏళ్ల తర్వాత అజిత్ సినిమాలో నటించబోతున్న స్టార్ హీరోయిన్…ఫ్యాన్స్ కు పూనకాలే…

Ajith:
నటుడు అజిత్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమాలను అభిమానించే అభిమానులు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. తమిళ్లో అమరావతి సినిమాతో అజిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
సెల్వ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత హీరో అజిత్ ఆసి, కాదల్ కొట్టి, కాదల్ మన్నన్, ఆహా వరువాల, వాలి వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ డంను సంపాదించుకున్నాడు. ఈయన సినిమాలకు తమిళ్ తోపాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ హీరోగా నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. ఇక తమిళ నాట హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేస్తారు.
లేటెస్ట్ గా అజిత్ విదాము యార్చి అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పట్టుదల అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. కానీ ఈ సినిమా అజిత్ ఫ్యాన్స్ కు మాత్రం కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.
ఇక ప్రస్తుతం హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అజిత్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అజిత్ భారీ హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Robinhood: హీరో నితిన్ తో కలిసి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మాస్ స్టెప్స్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. అజిత్ నటిస్తున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కూడా నటిస్తోంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఈ స్టార్ హీరోయిన్ అజిత్ సినిమాలో నటించిన విశేషం. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సిమ్రాన్. అప్పట్లో సిమ్రాన్ తెలుగుతోపాటు తమిళంలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా అజిత్ సినిమాలో సిమ్రాన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ ఒక వార్త వినిపిస్తుంది. అప్పట్లో అజిత్, సిమ్రాన్ కాంబినేషన్ లో వచ్చిన వాలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక దాదాపు 25 ఏళ్ల తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వీరిద్దరూ కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. https://www.instagram.com/p/CstVCNzSzAJ/?utm_source=ig_embed&ig_rid=f93fbfb6-e3f5-4294-b368-f7a0d6d387c1