Robinhood: హీరో నితిన్ తో కలిసి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి మాస్ స్టెప్స్
Robinhood: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి తాజాగా హీరో నితిన్ తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.నితిన్ నటించిన తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నితిన్ మల్లారెడ్డి కాలేజీకి వెళ్లారు. అక్కడ మల్లారెడ్డి నితిన్ ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సరదాగా ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు.
ఈ వీడియోలో మల్లారెడ్డి తనదైన ప్రత్యేకమైన స్టైల్లో మాస్ స్టెప్పులు వేయగా, నితిన్ కూడా ఆయనకు తగ్గట్టుగా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వీరిద్దరి డ్యాన్స్ అక్కడున్న విద్యార్థులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మల్లారెడ్డి వేసిన కొన్ని స్టెప్పులకు నితిన్ కూడా ఆశ్చర్యపోయినట్లు కనిపించారు.
మల్లారెడ్డి వయసును మరిచిపోయి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. “మల్లారెడ్డి గారు అదరగొట్టారు”, “నితిన్ కూడా బాగా డ్యాన్స్ చేశారు”, “మాజీ మంత్రిలో ఇంత జోష్ ఉందా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
-
Mallareddy IT Raids: మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్
-
Fish Venkat Daughter: రామ్ చరణ్ సాయంపై ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్