Anil Ravipudi: హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Anil Ravipudi: తెలుగు ఇండస్ట్రీలో అసలు అసజయాలు లేని దర్శకుడిగా రాజమౌళి ఉన్నాడు. ఆ తర్వాత ఎవరైనా డైరెక్టర్ ఉన్నారంటే అది అనిల్ రావిపూడినే (Anil Ravipudi). ప్రతీ ఏడాది కొత్త కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. అలా వచ్చి ఇలా హిట్ కొడుతుంటాడు. అయితే దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి తనదైన మార్క్‌ను చూపించాడు. అయితే అనిల్ రావిపూడి గురించి కొందరికి కొన్ని విషయాలు అసలు తెలియవు. మరి అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఏపీలోని ప్రకాశం జిల్లాలో జన్మించాడు. వీరిది ఒక సాధారణ కుటుంబం. తండ్రి ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేసేవారు. అతనికి వచ్చే రూ.5000 సంపాదనతోనే కుటుంబం జరిగేది. ఇలా చిన్నప్పటి నుంచి తన తండ్రి కష్టాలను చూస్తూ పెరిగాడు. చిన్నప్పటి నుంచే అనిల్ రావిపూడికి సినిమాలు అంటే ఇష్టం. కానీ తండ్రి ఇష్టంతో బీటెక్ చదివాడు. ఆ తర్వాత సినిమా వైపు అడుగులు వేశాడు. అయితే తమ్ముడు సినిమా దర్శకుడు అరుణ్ ప్రసాద్, అనిల్ రావిపూడికి కాస్త దూరపు బంధువులు. దీంతో అతని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత రైటింగ్‌లో కూడా అనిల్ బాగా శిక్షణ తీసుకున్నాడు. అరుణ్ ప్రసాద్‌తో గౌతమ్ ఎస్ఎస్సి సినిమాకి పనిచేశాడు. ఆ తర్వాత శౌర్యం సినిమాకి రైటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కందీరీగా, దరువు, మసాలా, ఆగడు వంటి సినిమాలకు కూడా రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆ తర్వాత అనిల్ దర్శకుడిగా తీసిన సినిమాలు మాత్రం మంచి హిట్‌ను సాధించాయి.
రవి తేజ రాజా ది గ్రేట్, వెంకటేష్ ఎఫ్ 2, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో అనిల్ మళ్లీ వాళ్లకి హిట్లు ఇచ్చాడు. అయితే అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అంత ఈజీగా కూడా అవకాశం రాలేదు. పటాస్ సినిమా మంచి హిట్ కావడంతో ఎఫ్ 2 సినిమా తీశారు. ఈ సినిమాలో మంచి ఫన్ ఉండటంతో సినిమా మంచి హిట్ అయ్యింది. దీంతో ఇతను మంచి కాన్సెస్ట్లతో ఏడాదికి ఒక సినిమా చేస్తుంటాడు. అలాగే హిట్లు కొడుతున్నాడు. ఇదిలా ఉండగా అలా మొదలైంది సినిమాని నందిని డైరెక్ట్ చేశారు. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం అనిల్ రావిపూడి డిజైన్ చేశారు. ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా మందికి నచ్చింది. చాలా కామెడీగా ఉండటంతో పాటు కాస్త కొత్తగా కూడా ఉంటుంది. అయితే దీన్ని అనిల్ రావిపూడి డిజైన్ చేశారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.