Interesting Facts : బాత్రూమ్ లో టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ లను ఉంచుతున్నారా?

Interesting Facts : కొందరు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. మరికొందరు బద్దకం, బిజీ వల్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ ఈ తప్పులు చాలా సమస్యలను తెచ్చిపెడతాయి. దీని వల్ల మరిన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే టూత్ బ్రష్ ను, పేస్ట్ ను చాలా మంది బాత్రూమ్ లోనే వదిలేస్తారు. కానీ దీని వల్ల ఎంత ప్రమాదమో మీకు తెలుసా? కచ్చితంగా ఈ ఆర్టికల్ ను చదివి ఇక నుంచి అయినా సరే ఈ పెద్ద తప్పును అసలు చేయకండి. దీని వల్ల చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
మీ టాయిలెట్ నుంచి చాలా క్రిములు టూత్ పేస్ట్ మీద వచ్చి వాలుతాయి. కూర్చొంటాయి. నాట్యం చేస్తుంటాయి. టాయిలెట్ ఫ్లష్ నుంచి బయటకు వచ్చే బ్యాక్టీరియా కూడా మీ టూత్ బ్రష్ మీద కూర్చొంటుంది. తర్వాత మీరు దాన్నే నోట్లో వేసుకోవాలి. మీరు టాయిలెట్ బౌల్‌ను ఫ్లష్ చేసిన ప్రతిసారీ, దాని నుంచి సూక్ష్మ కణాలు గాలిలోకి విడుదలవుతాయి. ఇవి మీ బాత్రూమ్ లో ఎలాంటి వస్తువులు ఉన్నా సరే వాటి అన్నింటి మీద వచ్చి వాలుతాయి. కేవలం టూత్ బ్రష్ మాత్రమే కాదు. సో మీరు నిత్యం ఉపయోగించే ఎలాంటి వస్తువులు అయినా సరే బయటనే ఉంచాలి. టూత్ బ్రష్‌లలో E. coli, streptococcus, బూజుతో సహా మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
యే మేము ఉదయం లేచి బ్రష్ ను శుభ్రంగా కడిగిన తర్వాతనే బ్రష్ చేస్తాము అనుకుంటున్నారా? మీరు ఎంత క్లీన్ చేసినా సరే అది క్లీన్ కాదు అంటున్నారు నిపుణులు. అందుకే వారానికి ఒకసారి టాయిలెట్ ను శుభ్రం చేసుకోండి. యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ముళ్ళగరికెలను 10 నిమిషాలు నానబెట్టి క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మీ బ్రష్ మీద పేరుకుపోకుండా నిరోధిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కచ్చితంగా మీ బ్రష్ ను మార్చాలి. అరిగిపోయిన టంగ్ క్లీనర్ లు, బ్రష్ లలో ఎక్కువ క్రిములు ఉంటాయి. పూర్తిగా శుభ్రం చేయవు. కొత్త బ్రష్ మస్ట్.
టాయిలెట్ నుంచి బ్రష్‌ను 6 అడుగుల దూరంలో ఉండటం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఫ్లష్ స్ప్రేతో సంబంధాన్ని నిరోధిస్తుంది. మీ బ్రష్‌ను టాయిలెట్ నుంచి దూరంగా క్యాబినెట్ లేదా షెల్ఫ్‌లో ఉంచండి. బాత్రూమ్ క్రిములు దరిచేరవు. ఈ టూత్ బ్రష్ లకు వెంటిలేటెడ్ క్యాప్ ను ఉపయోగించండి. ఇది గాలి ప్రసరించేలా చేస్తుంది. బ్రష్, టంగ్ క్లీనర్ లను పొడిగా ఉంచుతుంది. గాలి చొరబడని కవర్లు మీ బ్రష్‌ను బ్యాక్టీరియా ఫ్యాక్టరీగా మారుస్తాయి. వెంటిలేటెడ్ సిలికాన్ క్యాప్స్ గాలి ప్రవాహాన్ని అనుమతిస్తాయి. టంగ్ క్లీనర్, బ్రష్ లను పొడిగా ఉంచుతుంది. క్రిముల పెరుగుదలను తగ్గిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?