Balakrishna Help: గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. అభిమాని కోసం ఏం చేశారంటే..
Balakrishna Help బాలకృష్ణ భార్య వసుంధర దేవి బద్రి స్వామి కుటుంబానికి అందజేశారు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Balakrishna Help: బాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. తాజాగా బాలకృష్ణ చేసిన పనిచేస్తే శభాష్ అంటారు. బాలకృష్ణ తన వీరాభిమానిని ఆదుకోవడమే కాదు ఓ కుటుంబాన్ని నిలబెట్టారు. బాలకృష్ణ అభిమాని బద్రి స్వామి చాలా రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ చేయడానికి 20 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఈ విషయాన్ని బాలకృష్ణ దాకా చేరవేశారు. విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించి, గవర్నమెంట్ నుంచి బద్రి స్వామికి 10 లక్షల ఎల్ ఓసిని మంజూరు చేయించారు.
బాలకృష్ణ భార్య వసుంధర దేవి బద్రి స్వామి కుటుంబానికి అందజేశారు. దీనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణ ప్రస్తుతం ఆఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హీరో అయినా రాజకీయ నాయకుడైనా జనాల్లో హైలైట్ అవ్వాలంటే దానికి కారణం అభిమానులే.. అభిమానుల వల్లే ఇదంతా జరుగుతుంది. అభిమానులు హీరోలకి, రాజకీయ నాయకులకి అంత గొప్ప స్థానాన్ని ఇవ్వడం వల్లే వారికి ఆ పొషిషన్ వస్తుంది.