Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోలు.. ఎవరంటే
Bigg Boss 9 Telugu గతంలో యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ సినిమాలు తీసి క్రేజీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చిందని సమాచారం. మరోవైపు ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ప్రతి రోజు ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారు రాజ్ తరుణ్, సుమంత్ అశ్విన్. గతంలో యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ సినిమాలు తీసి క్రేజీ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు.
రాజ్ తరుణ్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సక్సెస్ పడడం లేదు. మరోవైపు సుమంత్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. ఫ్రెండిషిప్ డేను పురస్కరించుకుని బిగ్ బాస్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్లోకి సంబంధించిన మధుర క్షణాలను చూపించారు.