Bigg Boss 9: నాగార్జున్ ఔట్.. బాలయ్య ఇన్.. హోస్టింగ్‌పై క్లారిటీ ఇదే!
ఏ భాషలో అయినా బిగ్ బాస్ (Bigg Boss) అంటే జనాలు పడి చచ్చిపోతారు. ప్రతీ ఏడాది ఒక్కో సీజన్ ప్రసారం అవుతుంది. అయితే స్టార్ మాలో (Star Maa) తెలుగులో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటి వరకు బిగ్ బాస్ మొత్తం 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది.

Bigg Boss 9: ఏ భాషలో అయినా బిగ్ బాస్ (Bigg Boss) అంటే జనాలు పడి చచ్చిపోతారు. ప్రతీ ఏడాది ఒక్కో సీజన్ ప్రసారం అవుతుంది. అయితే స్టార్ మాలో (Star Maa) తెలుగులో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటి వరకు బిగ్ బాస్ మొత్తం 8 సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది బిగ్ బాస్ 9 సీజన్‌ను ఆగష్టు నెల చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో (Social Media) బాగా వైరల్ అయిన వారి పేర్లు ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా నిర్వహించగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా నిర్వహించాడు. మూడవ సీజన్ నుంచి ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ 9వ సీజన్‌కి నాగార్జున కాకుండా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also: సముద్రంలో భయానక దృశ్యం.. అమెరికాలో బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన మెక్సికో షిప్!
బిగ్ బాస్ 9వ సీజన్‌కి బాలకృష్ణ హోస్ట్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కొందరు ఇది అబద్ధమని అంటున్నారు. అయితే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఒప్పందం అనేది కేవలం సీజన్ 7తోనే పూర్తి అయ్యిందట. ఆ తర్వాత సీజన్‌లోనే బాలయ్యను తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించింది. కానీ బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించనని తెలిపారట. ‘అన్ స్టాపబుల్’ షోని బాలయ్య (Balayya) హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆహాలో ప్రసారమయ్యే ఈ షో హోస్టింగ్ చూసి ఎలాగైనా కూడా బాలయ్యను తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం భావించింది. కానీ బాలయ్య బాబు ఒప్పుకోకపోవడంతో నాగార్జున చేశారు.
Read Also: సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే న్యూస్.. ఇకపై ఆ చికిత్సలన్నీ ఉచితమే
ఆహా షోలో బాలయ్య హోస్టింగ్ చేయడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ (Allu Arvind) మీద అభిమానం అని బాలకృష్ణ చెప్పారట. ఈ క్రమంలో మళ్లీ బిగ్ బాస్ సీజన్ 12 వరకు హోస్ట్‌గా నాగార్జునతో ఒప్పందం చేసుకున్నారు. వచ్చే సీజన్‌లో కూడా నాగార్జున హోస్ట్. బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. నాగార్జున మొదటిలో బాగానే హోస్ట్ చేశారు. కానీ తర్వాత సీజన్‌లో హోస్టింగ్ సరిగ్గా నిర్వహించలేదని విమర్శలు వచ్చాయి. సాధారణ రోజుల్లో బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా ఉండేదో.. వీకెండ్స్‌లో కూడా అలా ఉండటంతో విమర్శలు వచ్చాయి. అసలు హోస్ట్‌లో పస లేదని చాలా మంది కామెంట్లు చేశారు. ఈ కారణంగానే బిగ్ బాస్ యాజమాన్యం హోస్ట్‌ను మార్చాలని భావించింది.
-
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి ఇద్దరు టాలీవుడ్ హీరోలు.. ఎవరంటే
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది
-
Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది
-
Viral Video : వ్యూస్, లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా.. మెడలో కప్పలతో డ్యాన్స్ చేసిన మహిళ!
-
Viral Video : మనుషుల కంటే ఆవులే బెటర్.. జాతీయగీతానికి నిలబడి గౌరవించిన గోమాత