Katrina Kaif: హాట్ అందాలతో యోగాసనాలు వేస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. కుర్రాలు చూస్తే ఫిదా!

Katrina Kaif: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్లు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు. కొందరు అయితే దేశంలో స్టార్ హీరోయిన్ హోదాను కొనసాగిస్తున్న వారిలో కత్రినా కైఫ్ కూడా ఉంది. బాలీవుడ్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలుతుంది. బాలీవుడ్‌లో బూమ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. మల్లేశ్వరి తర్వాత కత్రినా నందమూరి బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. వరుస రెండు తెలుగు సినిమాలు హిట్ కావడంతో ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు సినిమాలతో హిట్ కొట్టి క్రేజ్ సంపాదించుకున్న కత్రినా ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి వరుస హిట్‌లు కొట్టింది. బాలీవుడ్ స్టార్ నటులు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్ వంటి హీరోల సరసన నటించింది. వరుస హిట్‌లు కొట్టి స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కత్రినా నిలిచింది. కెరీర్ స్టార్టింగ్ లో డ్యాన్స్ కూడా రాదని కత్రినా చాలా సార్లు తెలిపింది. కానీ ఇప్పుడు అందం, నటన, డ్యాన్స్‌తో ఇప్పుడు అదరగొడుతుంది.
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఒకప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. విక్కీ కౌశల్ మాత్రం వరుస హిట్‌లు కొడుతున్నాడు. కత్రినా గతేడాది మెర్రీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ హీరో విజయ్ సేతుపతి సరసన ఇందులో నటించింది. అయితే కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేసి ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. అయితే ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కత్రినా కైఫ్ కొన్ని ఆసనాలు వేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆమె వేసి భంగిమలు చాలా కష్టమైనవి. కానీ చాలా సునయాసంగా ఆమె యోగాసనాలు వేసింది. ఇవే ఆమె బ్యూటీ సీక్రెట్ అని నెటిజన్లు అంటున్నారు. 41 ఏళ్ల వయస్సులో కూడా ఇంత అందంగా ఉండటం వెనుక కత్రినా మెయింటెన్స్ అని నెటిజన్లు అంటున్నారు. తన అందంతో కత్రినా యంగ్ హీరోయిన్లను వెనుకకు నెట్టేస్తుంది. యోగాసనాలు చేస్తూ ఎంతో హాట్‌గా కత్రినా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తు్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ ఫొటోలను చూసేయండి.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!