Mahesh Babu: అద్దం ముందు సింహంలా నిల్చున్న మహేష్ బాబు.. ఇంతకీ రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు?

Mahesh Babu:
జక్కన్న సినిమా వస్తుందంటే ఊహలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన ఈ డైరెక్టర్ పేరు వింటేనే ఓ రకమైన ఫీల్ వస్తుంటుంది అభిమానుల్లో.. మరి అలాంటిది స్టార్లతో సినిమా అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి. సినిమా సినిమాకు కొత్త ధనం. ఓ సినిమాను మించి మరో సినిమా ప్లాన్ చేస్తుంటాడు జక్కన్న. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఓటమి పాలు కాకుండా, ఫ్లాప్ లకు ఆస్కారం లేకుండా ఇండస్ట్రీని ఏలుతున్న డైరెక్టర్ రాజమౌళి.
ఇక మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతుందా? లేదా తగ్గుతుందా అనే రేంజ్ లో ఉంటారు ఈ సూపర్ స్టార్. తన లుక్ ను మారుస్తూ అందాన్ని రెట్టింపు చేసుకుంటూ యంగ్ హీరోలకు కూడా చెమటలు పట్టిస్తుంటాడు మిల్క్ స్టార్ మహేష్ బాబు. మరి ఇలాంటి హీరో, ది గ్రేట్ డైరెక్టర్ కాంబినేషన్ అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఓ రెండు సంవత్సరాలు సినిమా కోసం సమయం వెచ్చించినా సరే విడుదల అయితే బాక్సులు బద్దలే.. థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే..
అందుకే SSMB 29 మీద ఇప్పుడు ఆశలు పెరిగాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. అందుకే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే తెగ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా మహేష్ బాబు లుక్ కు సంబంధించి ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి అదుర్స్ మా మహేష్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ స్టోరీ అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఏ స్టోరీతో రాబోతున్నారు మా స్టార్లు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
ఇక ఇన్ని ప్రశ్నలకు తావిచ్చిన ఆ వీడియోలో ఏముంది అంటే? మహేష్ లుక్ మారిపోయిన విషయం తెలిసిందే. స్టార్ హీరో రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. వర్కౌట్స్ తర్వాత మహేష్ బాబు జిమ్ లో అటూఇటూ నడుస్తున్నారు. అందులో తనను తాను అద్దంలో చూసుకుంటారు. అంతే సింహం అద్దం ముందు నిల్చుందా అన్నట్టుగా అటు నుంచి ప్రతిబింబం కనిపించింది. ఇంకే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా? మా మహేష్ అన్నయ్య సింహం అంటూ తెగ విజిల్స్ వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. కానీ వెంటనే బ్రేక్ ఇచ్చారు.
కొన్ని రోజులు బ్రేక్ తో ఆగిన ఈ సినిమా మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కింది. ఈ బ్రేక్ సమయంలోనే ప్రియాంక చోప్రా సోదరుడి వివాహం జరిగింది. ఆ వేడుకలు పూర్తి అయిన వెంటనే వచ్చి హైదరాబాద్ లో వాలింది. మొత్తం మీద కొత్త షెడ్యూల్ తో మళ్లీ
SSMB 29 ఊపందుకుంది. అయితే సమ్మర్ లో విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమా ఎలా ఉండనుందో. ఈ సారి ది స్టార్ కాదు కాదు ది గ్రేట్ డైరెక్టర్ ఏ కంటెంట్ తో వస్తున్నారో చూడాలంటే చాలా… వెయిట్ చేయాల్సిందే..
Superstar @urstrulyMahesh #SSMB29 Look🔥💥 pic.twitter.com/4PYCdUW9X9
— Filmy Focus (@FilmyFocus) February 27, 2025