SSMB29 లీక్ బజ్ క్రియేషన్ కోసం మూవీ టీం కావాలనే చేసిందా? ఇందులో నిజమెంత?

SSMB29:
ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో SSMB29 ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్‌లో కూడా చర్చ జరుగుతోంది. సినిమా నుంచి మొదటి అప్‌డేట్ ఎప్పుుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ సినిమా షూటింగ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా ఓ క్లిప్ లీక్ అయ్యింది. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షూటింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి. నిజానికి రాజమౌళి సినిమాల షూటింగ్ సిన్ లీక్లు పెద్దగా జరగవు. అందులోనూ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఇలా జరగడమేంటని సందేహాలు వస్తున్నాయి. షూటింగ్ వీడియోను లీక్ కావాలని చేసిందా? లేకపోతే అనుకోకుండా జరిగిందా? ఇలా అనేక రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి అసలు భద్రత లేకపోవడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మూవీ టీం కావాలనే ఇలా ప్లాన్ చేసిందని, ఇది కేవలం బజ్ క్రియేషన్ అని అంటున్నారు. అసలు ఇందులో నిజమెంత అనే విషయంపై క్లారిటీ లేదు.
కొందరు రాజమౌళి మూవీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు తన సినిమాకి తానే ఎందుకు లీక్‌లు చేస్తారు. అసలు రాజమౌళికి బజ్ క్రియేట్ చేయవలసిన అవసరం ఏముందని అంటున్నారు. అయితే ఈ షూటింగ్ క్లిప్ లీక్ అయిన తర్వాత మూవీ టీం భద్రతల విషయంలో కాస్త కట్టుదిట్టమైంది. ఇకపై ఎలాంటి లీక్‌లు జాగ్రత్త పడకుండా ఉండేందుకు కూడా ప్లాన్‌లు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ వంటి వాటిపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ చేయలేదు. అయితే షూట్ లీక్‌పై రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతీ విషయంలో అగ్రిమెంట్ పెట్టారు. అయినా కూడా ఇలా జరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ లీక్‌లపై మూవీ టీం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2027లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇకనైనా మూవీ టీం లీక్‌ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మున్ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది.
-
Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
-
SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి