Mahesh Daughter Sitara: మహేష్ ముద్దుల కూతురుకి డ్యాన్స్ నేర్పిస్తున్న ఆమె ఎవరో మీకు తెలుసా?

Mahesh Daughter Sitara: ప్రిన్స్ మహేష్ బాబుకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. మహేష్ కూతురు సితారకి మహేష్‌తో పోటీగా ఫాలోయింగ్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్‌లో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉన్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సితార అంటే పడి చచ్చిపోతారు. తన అందం, హుందాతనం, మంచితనం, సాయం చేసే గుణం ఇలా ఎందరో అభిమానులను సితార సొంతం చేసుకుంది. తన తండ్రి నటించిన సినిమా పాటలకే కాకుండా మిగతా పాటలకు కూడా సితార డ్యాన్స్ అదరగొడుతుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి చేసిన వీడియోలు కూడా ఉంటాయి. ఇవి అయితే చాలా సూపర్‌గా ఉంటాయి. వీటిని చూస్తే ఇంత చిన్న వయస్సులో ఇంత టాలెంటెడ్ అనిపిస్తుంది. మహేష్ బాబు కూడా కొన్నిసార్లు తన సోషల్ మీడియా అకౌంట్‌లో సితార డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. చాలా అద్భుతంగా సితార డ్యా్న్స్ చేస్తుంటుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. అయితే సితార బాగా డ్యాన్స్ చేస్తుంటుంది కదా.. అసలు ఈమెకు డ్యాన్స్ నేర్పించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్, ఢీ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జీగా అలరించిన ఆనీ మాస్టర్ సితారకు డ్యాన్స్ నేర్పిస్తున్నారట. ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. అయితే యానీ మాస్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. సితారకు డ్యాన్స్ నేర్పించడానికి నేను డైలీ మహేష్ బాబు ఇంటికి వెళ్తాను. నన్ను తీసుకెళ్లడానికి వారు బాగా ఖరీదైన బెంజ్ కారును పంపించేవారు. చూసే వాళ్లంతా కూడా ఆ బెంజ్ కారు తనదే అని అడిగేవాళ్లట. అయితే ఆ కారు తనది కాదని, మహేష్ బాబు సార్ వాళ్లదని ఆనీ మాస్టర్ చెప్పేవారట. అలాగే గౌతమ్‌కి డ్యాన్స్ నేర్పించడానికి కూడా నమ్రత మంచి డ్యాన్స్ మాస్టర్స్ కోసం చూస్తున్నారని విషయం తెలిసి నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. దీంతో నన్ను గౌతమ్‌కు డ్యాన్స్ నేర్పించడానికి తనని తీసుకున్నట్లు తెలిపారు. అయితే గౌతమ్‌కు డ్యాన్స్ నేర్పించేటప్పుడు సితార కూడా వచ్చి నేర్చుకునేది. గౌతమ్ ఎలా చేస్తే ఆమె కూడా డ్యాన్స్ చేసేది. చాలా క్యూట్ అనిపించేది. అయితే గౌతమ్ పై చదువులు చదవడానికి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి సితారకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆనీ మాస్టర్ తెలిపారు. సుమారుగా ఒక నాలుగున్నర ఏళ్ల నుంచి ఆనీ మాస్టర్ సితారకు డ్యాన్స్ నేర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే మహేష్ బాబుకు ఉన్నట్లే సితారకు కూడా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నట్లు ఆమె తెలిపింది.