Malavika Mohanan: ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ పాన్ ఇండియా స్టార్ హీరోతో నటించే అవకాశం… విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా

Malavika Mohanan:
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే చాలా కష్టమైన పని. ఎన్ని సినిమాలు చేసినా కూడా కొంతమందికి అనుకున్న క్రేజ్ రాదు. కొన్ని కొన్ని సార్లు అవకాశాలు వచ్చినా కూడా వాటిని వినియోగించుకొని సక్సెస్ అవ్వడం చాలా కష్టం.
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కూడా చేయకుండానే విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్లు కూడా ఉంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఈ కోవకు చెందిందే. ఈమె ఇప్పటివరకు తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. కానీ విపరీతమైన క్రేజ్ ఈమె సొంతం. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈమె యూత్ ఫేవరెట్ హీరోయిన్. కేరళ హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. మాళవిక 2013లో పటం పోల్ అనే సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ కేరళ అందం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడిగా తెలుగులో రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తెలుగులో మాళవిక మోహనన్ కు రాజా సాబ్ మొదటి సినిమా. దాంతో ఈ సినిమా పైన మాళవిక ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఈమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దాదాపు 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా ఉన్నా ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో రెడ్ కలర్ డ్రెస్ లో నడుము అందం చూపిస్తూ, నాభి అందాన్ని చూపిస్తూ ఉన్న ఫోటోలు కుర్రాళ్లకు చూపు తిప్పనివ్వడం లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాళవిక తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఈమెకు తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మొదటి సినిమా చేసే అవకాశం దక్కడం విశేషం.
ఈ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10 2025న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. హారర్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాలో హీరో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా భారీగా ఉన్నాయట.
Also Read: