Mithun Chakravarthi : కుక్కల కోసం విలాసవంతమైన ఫామ్ హౌస్, లగ్జరీ లైఫ్.. చివరకు కుక్కలకు కోట్ల ఆస్తిని కూడా రాసిచ్చిన స్టార్ హీరో.. ఎవరంటే..

Mithun Chakravarthi :
చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. పెంపుడు జంతువులను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా చాలామంది తమ ఇంట్లో కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. కుక్కలను కూడా ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా చూస్తూ మంచి ఆహారం పెట్టడం, పుట్టినరోజు చేయడం, ఫంక్షన్స్ కి తీసుకు వెళ్లడం వంటివి చాలామంది చేస్తుంటారు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరో కుక్కలపై తనకున్న అమితమైన ప్రేమతో వాటికి కోట్ల ఆస్తిని కూడా రాసిచ్చాడట. ఇక వాటికోసం ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించి, ఆ కుక్కలకు లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడట ఆ స్టార్ హీరో.మీరు ఎప్పుడైనా పెంపుడు జంతువు అయినా కుక్కలకు ఆస్తిని రాసి ఇవ్వడం గురించి ఎక్కడైనా విన్నారా. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక హీరో ఏకంగా తన పెంపుడు కుక్కలకు ఆస్తినే రాసిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1980లో ఇతను తన నటనతో బాలీవుడ్ ను షేక్ చేశాడు. ఆ సమయంలో వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత మిథున్ చక్రవర్తి రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మిథున్ చక్రవర్తి హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి అనేక ఆస్తులను కూడా సంపాదించుకున్నాడు. మిథున్ చక్రవర్తికి కుక్కలు అంటే చాలా ఇష్టం.
తాజాగా మిథున్ చక్రవర్తి కోడలు తన మామ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. మా మామగారికి కుక్కలు అంటే చాలా అమితమైన ప్రేమ. అందుకే ఈయన ఇంట్లో ఒకటో రెండో కాదు ఏకంగా 116 కుక్కలను పెంచుకుంటున్నట్లు తెలిపింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే అతను ఆ కుక్కలకు తన ఆస్తిని కూడా రాసిచ్చాడట. కుక్కల మీద తనకున్న అమితమైన ప్రేమతో వాటికోసం విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టి లగ్జరీ లైఫ్ ఇస్తున్నాడట ఆ స్టార్ హీరో. తన కుక్కల కోసం ఈ స్టార్ హీరో ఏకంగా 45 కోట్ల ఆస్తిని కేటాయించాడట.
ప్రత్యేకంగా వాటి కోసమే ఈ ఆస్తిని కేటాయించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ కుక్కల కోసం స్పెషల్ గదులు కూడా నిర్మించి వాటికి సంరక్షణ ఇస్తున్నాడట. అంతేకాకుండా ఆ స్టార్ హీరో కుక్కలు చిన్నపిల్లలు లాగానే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని కూడా చెప్తాడట. ఇంట్లో తన పెంపుడు కుక్కలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడట ఆ స్టార్ హీరో. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే ఈ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.