Health Issues: పెంపుడు జంతువులతో పిల్లలను ఆడుకోనిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Health Issues: పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు, పిల్లులతో పిల్లలు బాగా ఆడుకుంటారు. ఇవి ప్రేమను, ఆనందాన్ని ఇస్తాయి. చాలామంది తమ పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, ముద్దులు కూడా పెడుతుంటారు. అయితే, పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు తెలియకపోవడం వల్ల వారు ఎక్కువగా ఆ పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నారు. దీనివల్ల వారు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు అంటున్నారు. అయితే పెంపుడు జంతువులను ఇంట్లో పెంచుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం.
పెంపుడు జంతువుల నోట్లో, వాటి చర్మంపై అనేక రకాల బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉంటాయి. అవి తరచుగా బయట తిరుగుతూ, నేలపై ఉన్న వాటిని నాకి, శుభ్రంగా లేని ప్రదేశాలను తాకుతుంటాయి. మనకు కనిపించకపోయినా, వాటి నోటిలో సాల్మొనెల్లా, క్యాంపిలోబ్యాక్టర్, ఈ.కోలి వంటి బ్యాక్టీరియాలు ఉండొచ్చు. ఇవి మనుషులకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి మరింత ప్రమాదకరం. అలాగే, పెంపుడు జంతువుల నుంచి తామర, స్కాబీస్ వంటి చర్మ వ్యాధులు కూడా మనుషులకు సంక్రమించవచ్చు. కొన్నిసార్లు, వాటి నోటిలో ఉండే పరాన్నజీవుల గుడ్లు మనుషుల శరీరంలోకి ప్రవేశించి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఇది కూడా చూడండి: Kitchen AC : చల్లగా వంట చేద్దామని కిచెన్లో ఏసీ పెట్టిస్తున్నారా.. అదెంత డేంజరో తెలుసా ?
పెంపుడు జంతువుల పట్ల ప్రేమను చూపడంలో తప్పులేదు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముద్దు పెట్టుకునే బదులు, వాటిని నిమరడం, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం వంటివి చేయవచ్చు. పెంపుడు జంతువులతో ఆడిన తర్వాత, వాటిని తాకిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా ముఖ్యం. వాటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పశు వైద్యుడితో పరీక్షించి, టీకాలు వేయించడం, డీవార్మింగ్ చేయించడం వల్ల చాలావరకు సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్యం, మీ పెంపుడు జంతువు ఆరోగ్యం రెండూ ముఖ్యమేనని తెలుసుకోండి. వాటిని పట్టుకున్న తర్వాత మీరు కూడా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీకు ఎలాంటి చర్మ సమస్యలు రావు. హ్యాండ్ వాష్ వంటివి తప్పకుండా వాడండి. పిల్లలకు ఏదైనా ఫుడ్ పెట్టే ముందు కూడా చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత తినేలా చూడండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Skincare : వానాకాలంలో స్కిన్ అలర్జీలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షించుకునే చిట్కాలివే!
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Drinking Water: దాహం వేయడం లేదని వాటర్ తగ్గిస్తే.. ఆయుష్షు తగ్గిపోవడం పక్కా!