Prabhas: ప్రభాస్ అంటే ఇది.. పుట్టేడు శోకంతో ఉన్న రైటర్‌కి ఆర్థిక సాయం

Prabhas:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు. నటన, అందంలోనే కాకుండా మానవత్వంలోనూ ప్రభాస్ ముందుంటాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులతో ప్రస్తుతం ప్రభాస్ బిజీగా ఉన్నాడు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ సినిమాకు భారీ డిమాండ్ ఉంది. ఏ సినిమాలో అయినా ప్రభాస్ ఉన్నాడంటే చాలు సినిమాకి జనం క్యూలు కడుతుంటారు. ప్రభాస్ ఇటీవల నటించిన కల్కీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటినిగా నిలిచింది. ఇవే కాకుండా బాహుబలి, సాహో, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్‌లు అన్ని కూడా తన ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా మొత్తం కూడా ప్రభాస్‌కి మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రభాస్‌కి చాలా మంచి మానవత్వం ఉందని అంటుంటారు. షూటింగ్ సమయాల్లో ఇంటి భోజనం అందరికీ తీసుకొస్తారని చాలా మంది చెబుతుంటారు. సాయంలోనూ ప్రభాస్ ముందు ఉంటాడు. అయితే ప్రభాస్ ఓ మూవీ రైటర్‌కి సాయం చేశాడు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి స్వయంగా తెలియజేశాడు. సాయం చేస్తే మూడో కంటికి తెలియకూడదని అంటుంటారు. ప్రభాస్ కూడా ఇదే పద్ధతిని పాటించాడు. ఇంతకీ ప్రభాస్ సాయం చేసిన ఆ రైటర్ ఎవరు? ఎందుకు సాయం చేశాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రభాస్ గొప్పతనం గురించి మనం ఇప్పటి వరకు ఇతరుల చెబితేనే విన్నాం. కానీ ప్రభాస్ ఫిల్మ్ రైటర్ తోట ప్రసాద్‌కి సాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ అతనికి ఆర్థిక సాయం అందించారు. ఓసారి ప్రసాద్‌కి అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే ప్రసాద్‌కి ఆర్థిక సాయం చేశారు. ఆ సమయంలో ప్రభాస్ తండ్రి మరణించారు. ఎవరికైనా తండ్రి మరణం పుట్టెడు శోకాన్ని ఇస్తుంది. ఇలాంటి సమయాల్లో కూడా మాట తప్పకుండా గుర్తు పెట్టుకుని మరి సాయం చేశారని ప్రసాద్ తెలిపారు. ఇచ్చిన మాటను ప్రభాస్ అసలు తప్పడని అతను తెలిపారు. తండ్రి మరణించిన సమయంలో పుట్టెడు బాధలో ఉండి కూడా సాయం చేసి ప్రభాస్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడని అన్నారు. అయితే ప్రసాద్ ప్రస్తుతం కన్నప్పకు రైటర్‌గా వర్క్ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల మంచు విష్ణు కూడా హీరో ప్రభాస్ గురించి తెలిపారు. గొప్ప వ్యక్తి అని, ఇతని దగ్గర గొప్ప వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నానని తెలిపాడు. ప్రభాస్ కన్నప్పలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో రానుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.