Prasanth Varma : ప్రశాంత్ వర్మ బ్రహ్మరాక్షస్‌లో పాన్ ఇండియా స్టార్.. సినిమా షూటింగ్ ఎప్పుడంటే?

Prasanth Varma :
గతేడాది వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma), హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చింది. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో డైరెక్టర్, హీరో ఇద్దరికి కూడా వరుస ఆఫర్లు వచ్చాయి. హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ వరుస సినిమాలను లైనప్‌లో పెట్టారు. నట సింహం నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మూవీ టీం కూడా ప్రకటించింది. అయితే ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్టును కూడా చేయబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహింబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ ప్రభాస్ మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్‌కు ప్రశాంత్ వర్మ కొన్ని రోజుల కిందట బ్రహ్మ రాక్షస సినిమా కథను వినిపించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల రణవీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో సినిమా స్టోరీని ప్రభాస్‌కి వినిపించాడు. ఈ స్టోరీకి ప్రభాస్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. నేడే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా స్పిరిట్ మూవీ తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాష్ ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ పతాకం మీద విజయ్ కిరగందూర్ ప్రొడ్యూస్ చేయనున్నారు.
సలార్ సినిమాను కూడా ఇతనే ప్రొడ్యూస్ చేశారు. దీంతో వరుసగా ప్రభాస్ మూడు సినిమాల డీల్‌ను కూడా కుదుర్చుకున్నాడు. సలార్ 2, బ్రహ్మ రాక్షస్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చే ఇంకో సినిమాకు కూడా ఇతనే ప్రొడ్యూసర్. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. త్వరలో స్పిరిట్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాలు అయిన తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఇవి సెట్స్ పైకి వెళ్లే సరికి చాలా సమయం పడుతుంది. ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ గత ఏడాది మోక్షజ్ఞ లుక్‌ని రిలీజ్ చేశాడు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది.