Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
Sukumar-Junior NTR : వీరిద్దరూ మళ్లీ ఇలా కలవడంతో వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఫొటోకి మళ్లీ తారక్ రీపోస్ట్ చేశాడు. దీనికి నన్ను వెంటాడే ఎమోషన్ అని సుకుమార్‌ను ట్యాగ్ కూడా చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలో తప్పకుండా మూవీ వస్తుందని, తారక్ కూడా మూవీకి ఒకే చెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

Sukumar-Junior NTR : టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, జూఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయ్యింది. భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు మంచి టాక్‌ను సంపాదించుకుంది. అయితే ఈ కాంబోలో మళ్లీ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సుకుమార్ భుజంపై వాలి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో వీరి ఫొటోను స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సుకుమార్ భుజంపై తారక్ వాలుతూ ఉండగా.. దీనికి ఆమె ప్రేమతో అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ మళ్లీ ఇలా కలవడంతో వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఫొటోకి మళ్లీ తారక్ రీపోస్ట్ చేశాడు. దీనికి నన్ను వెంటాడే ఎమోషన్ అని సుకుమార్‌ను ట్యాగ్ కూడా చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలో తప్పకుండా మూవీ వస్తుందని, తారక్ కూడా మూవీకి ఒకే చెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్, సుకుమార్ మధ్య నాన్నకు ప్రేమతో వంటి మంచి ఎమోషనల్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా ఎలాంటి వారికైనా నచ్చుతుంది. ఎంతో ఎమోషనల్ అయిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. నాన్నకు ప్రేమతో అనే పాటల్లో ఈ మూవీ పాటలే గుర్తుకు వస్తాయి. అయితే సుకుమార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పుష్ప 2 రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సంచనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత పుష్ప 3 ప్లాన్ చేస్తున్నారు. మరి సుకుమార్ ఏ సినిమాను పట్టాల మీదకు తీసుకొస్తారో చూడాలి. ఏదేమైనా తారక్ సుకుమార్ మళ్లీ కలిసి పని చేయబోతున్నారనే సంకేతాలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరూ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉన్నా, అభిమానుల ఉత్సాహం మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎవరో ఒకరు ప్రకటన విడుదల చేస్తేనే తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమతో అలరించాడు. ఏ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా మొదటి పార్ట్ వచ్చింది. రెండో పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ
-
Sukumar And Shahrukh Khan: త్వరలో సుకుమార్, షారుక్ ఖాన్ కాంబోలో సినిమా.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త…
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?