Keerti Suresh : పవర్ ఫుల్ పాత్రలో మహానటి.. మరో బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్
Keerti Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న అమ్మడు ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Keerti Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న అమ్మడు ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అని అంతా అనుకుంటారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించే వాళ్లు చాలా కొద్ది మందే ఉంటారు. పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఛాన్సులు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు వెనుకాడతారు. ప్రేక్షకులు కూడా ఇంతకు ముందులా వారిని ఆదరించరు. ఈ మాటలన్నింటినీ మార్చేస్తూ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా నటిస్తూ, వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అదే సమయంలో మేకర్స్, ప్రేక్షకుల ఆలోచన కూడా మారిపోయింది.
పెళ్లయినా హీరోయిన్ల కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు నిరూపిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా , అలియా భట్ ఇలాంటి వాళ్లని చూస్తే అప్పుడే అర్థం అవుతుంది. వారి జాబితాలో ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా చేరిపోయింది. కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని వీరంతా నిరూపిస్తున్నారు. ‘మహానటి’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెదరని ముద్ర వేసుకున్న ఆమె పెళ్లి తర్వాత స్పీడ్ పెంచింది. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్‌లోనే వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతుంది.
‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తికి.. ఫస్ట్ సినిమానే ఊహించని షాక్ ఇచ్చింది. ఆ సినిమా పెద్ద షాకిచ్చింది. ఎంత ప్రమోషన్ చేసినా సినిమా డిజాస్టర్ కావడంతో కీర్తి బాలీవుడ్ అవకాశాలు ఇక మీద కలే అనుకున్న సమయంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద రూపొందుతున్న ఓ సినిమాలో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావుతో కలిసి కీర్తి నటిస్తున్నట్లు ప్రచారం జరుతోంది. దీన్ని రాజ్ తన సొంత నిర్మాణ సంస్థపై తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విద్యావ్యవస్థ ఓ బిజినెస్ మాదిరి అయిపోయింది. ర్యాంకుల మోతలో ప్రైవేట్ కాలేజీలు స్టూడెంట్ల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ వ్యవస్థలో జరుగుతోన్న కుంభకోణాలని ధైర్యంగా బయటపెట్టే పవర్‌ఫుల్ విద్యావేత్తగా కీర్తి నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘సెక్టార్ 36’ఫేమ్ ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించనున్నారు. వచ్చే నెల ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఇక కీర్తికి తెలుగులో అనేక అవకాశాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం ఇంత వరకు రాలేదు. నితిన్ సరసన ‘ఎల్లమ్మ’ కోసం సంప్రదిస్తే డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో్ లో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న ‘రౌడీ జనార్ధన్’ సినిమాలో కీర్తి సురేష్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్. ఇక సుహాస్ పక్కన ‘ఉప్పు కప్పురంబు’ మూవీ ఇప్పటికే ఓకే అయిన సంగతి తెలిసిందే అలాగే బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ పక్కన కూడా ఆమె ఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది.
-
Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్‌లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం