Single Trailer : శ్రీ విష్ణు సింగిల్ ట్రైలర్: ఇదే హైలెట్ అసలు
Single Trailer: సింగిల్ అనే సినిమాతో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 9వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. కామెడీతో ట్రైలర్ అయితే అదిరిపోయింది.

Single Trailer : విలక్షణ చిత్రాలు, పాత్రల్లో నటిస్తూ తన కంటూ ఒక ఫేమ్‌ను శ్రీ విష్ణు సంపాదించుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. ఒక్కో సినిమాకి తన నటన, స్టోరీ సెలక్షన్, వరుస హిట్‌లు కొట్టడంతో ఏకంగా విష్ణు రేంజ్ మారిపోయింది. శ్రీ విష్ణు సినిమా ఏదైనా గుర్తు వస్తుందంటే చాలు.. ఈ సినిమాలో ఏదో కొత్త దనం ఉంటంది. తప్పకుండా సినిమా చూడాలని ముందే ప్లా్న్ చేసుకుంటారు. ఏదైనా కొత్త స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు వస్తుంటాడు. గతేడాది స్వాగ్ అంటూ కొత్త స్టోరీతో వచ్చి.. హిట్ కొట్టేశాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వస్తూ.. మంచి హిట్‌ను సంపాదించుకున్నాయి. ఇలా ప్రతీ సినిమాలో ఏదో ఒక కొత్త దనం, యాక్టింగ్, కామెడీ వంటి వాటితో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే మళ్లీ ఓ సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగిల్ అనే సినిమాతో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 9వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. కామెడీతో ట్రైలర్ అయితే అదిరిపోయింది.
కార్తీక్ రాజ్ డైరెక్షన్‌లో సింగిల్ మూవీ వస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇందులో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో శ్రీ విష్ణుని ఇద్దరూ లవ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం చూసుకుంటే కామెడీగానే ఉంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం కామెడీగానే ఉండనుంది. ట్రైలర్ మొత్తంలో శ్రీ విష్ణు చెప్పే చివరి డైలాగ్ అదిరిపోయింది. అమ్మాయిల జోలికి వెళ్తే అబ్బాయిలు మంచులా కురిసిపోతారుని అంటాడు. ఇందులో సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు కూడా ఉన్నాడు. బుల్లిరాజుతో ఇంకా కామెడీ అదిరిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్‌లో మూవీ స్టోరీ మొత్తం తెలియలేదు. కానీ సినిమా మాత్రం పక్కా కామెడీతో అదిరిపోనున్నట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణుకి ఈసారి పక్కా హిట్ పడనుందని నెటిజన్లు అంటున్నారు.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్ట్ మూవీ
-
Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ ఒక్క యాడ్ ఫిల్మ్ కి ఎంత తీసుకుంటాడో తెలుసా..?
-
Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?