Ram Charan: రామ్ చరణ్ వాచ్ చూశారా.. దీంతో ఏకంగా ప్లాటే కొనవచ్చు

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. కేవలం సినీ రంగంలోనే కాకుండా ఫ్యాషన్ విషయంలో కూడా రామ్ చరణ్ టాప్‌లోనే ఉంటాడు. ఎలాంటి ఈవెంట్‌కి వెళ్లినా కూడా రామ్ చరణ్ ప్రత్యేకంగా నిలుస్తాడు. కొత్త మోడల్‌లో ఉండే డ్రెస్, వాచ్ ఇలా రకరకాలవి ధరిస్తుంటాడు. అయితే ఈ మధ్య రామ్ చరణ్ ఓ వాచ్ ధరించారు. ఇది చాలా మంది ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకర్షించింది. చూడటానికి సింప్లీ సూపర్‌గా ఉండే ఈ వాచ్ చాలా బాగుంది. రామ్ చరణ్ ధరించిన రోలెక్స్ వాచ్ ఎక్కువగా ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది. ఇది రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 వాచ్. ఈ వాచ్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఎందుకంటే నార్మల్ వాచ్ కాదు. జిగ్సా పజిల్‌తో చూడటానికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఇది మోడ్రన్ యుగంలో ఉండే ఫ్యాషన్ ప్రియులకు మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. ఎవెరెస్ గోల్డ్‌లో కాస్త నీలం, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపు వంటి రంగుల షేడ్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడటానికి పజిల్స్‌లా కనిపిస్తాయి. అయితే ఈ వాచ్ చాలా ఖరీదు. దీన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. సాధారణ వాచ్‌లాగా ఇందులో అంకెలు ఉండవు. ఈ అంకెలకు బదులు ఎమోజీలు ఉంటాయి. ఒక్కో ఎమోజీ ఒక్కో దాన్ని సూచిస్తుంది. హ్యాపీ (సంతోషం), ఎటెర్నిటీ (శాశ్వతత్వం), గ్రాట్యూటీ (కృతజ్ఞతలు), హోప్ (ఆశ) వంటి ఎమోజీలు ఎక్కువగా ఉంటాయి.
రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ చాలా ఖరీదు ఎక్కువ. ఈ వాచ్‌ను కొనాలంటే మాత్రం ఏకంగా ఒక ప్లాట్ వచ్చేస్తుంది. ఈ రోలెక్స్ వాచ్ ఖరీదు రూ.2 కోట్లు. ఈ వాచ్ కేవలం కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. ఎక్కువగా కోటీశ్వరుల దగ్గర మాత్రమే ఈ వాచ్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఈ రెండు కోట్ల వాచ్‌తో ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అయితే కేవలం ఈ ఒక్క వాచ్ మాత్రమే కాకుండా.. రామ్ చరణ్ దగ్గర ఎన్నో ఆధునాతనమైన వాచ్‌లు ఉన్నాయి. మార్కెట్‌లోకి ఏదైనా కొత్త వాచ్ వచ్చిన రామ్ చరణ్ కొనుగోలు చేస్తుంటారు. ఇదే కాకుండా ఏడు కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కూడా రామ్ చరణ్ దగ్గర ఉంది. అలాగే మూడు కోట్ల విలువైన బ్రిటిష్ స్పోర్ట్స్ కారు కూడా రామ్ చరణ దగ్గర ఉంది. ఇదే కాకుండా రూ.80 లక్షల విలువ చేసే మరో ఖరీదైన వాచ్ కూడా రామ్ చరణ్ దగ్గర ఉంది. ఇలా చెప్పకుంటూ పోతే ఎన్నో విలువైనవి ఉన్నాయి. అయితే రామ్ చరణ్ ఆస్తులు విలువ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి.