RC 16:శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ కంప్లీట్.. త్వరలోనే ఆర్‌సీ 16 సెట్స్‌లోకి జాయిన్

RC 16:
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో ఆర్‌సీ 16 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ శివరాజ్ కుమార్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని.. వేరే నటుడిని తీసుకోవాలని అనుకుంటున్నారని అంతా భావించారు. కానీ శివరాజ్ కుమార్‌నే తీసుకుంటున్నట్లు బుచ్చిబాబు ఇటీవల తెలిపారు. శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ ఇప్పటికే పూర్తి అయ్యిందని, త్వరలోనే ఆర్‌సీ 16 సెట్స్‌లోకి జాయిన్ అవుతారని మూవీ టీం ప్రకటించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారని, ఇందులో జాయిన్ అవుతారని తెలుస్తోంది. రామ్ చరణ్‌తో కలిసి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర ఎలా ఉంటుందనే విషయం ఇంకా తెలియదు. కానీ శివరాజ్ కుమార్ ఓల్డ్ మ్యాన్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు కర్ణాటకలోని శివరాజ్ కుమార్ ఇంటికి వెళ్లి లుక్ టెస్ట్ చేశారు. శివరాజ్ కుమార్ పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఇతని పాత్ర చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా శివరాజ్ కుమార్ గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గతేడాది క్యాన్సర్‌కి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే దాదాపుగా మూడు నెలల నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం కాస్త కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోల స్పోర్ట్స్ డ్రామాగా RC16 సినిమా వస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే నాలుగు పాటు కూడా రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఈ నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉంది. ఆ సమయంలో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటు గ్లింప్స్ లేదా టీజర్ కూడా త్వరలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను కూడా ఇంకా ప్రకటించలేదు. దీన్ని ముందుగా ప్రకటించే అవకాశం ఉంది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు రామ్ చరణ్‌తో చేయడంతో.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అందులోనూ సుకుమార్ శిష్యుడు కావడంతో సినిమా పక్కా హిట్ అని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో తప్పకుండా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.