Deputy CM Pawan Kalyan: ఆ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు ఏమైందంటే?

Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఒక పక్క రాజకీయం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. పవన్ చేతి నిండి సినిమాలు ఉన్నా కూడా ఎన్నికల కోసం బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తి అయిన కూడా ఆ సినిమాల షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. రాజకీయంలో బిజీగా ఉంటున్నారు. వరుస మీటింగ్‌లు, పర్యటనలతో బిజీగా ఉండటం వల్ల సినిమాలు షూటింగ్‌లు మధ్యలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ అల్‌మోస్ట్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఇది కూాడా చూడండి:Bigg Boss 9: నాగార్జున్ ఔట్.. బాలయ్య ఇన్.. హోస్టింగ్‌పై క్లారిటీ ఇదే!
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వీటి షూటింగ్‌కి అసలు సమయం కేటాయించలేకపోతున్నాడు. ఫైనల్‌గా హరి హర వీర మల్లు షూటింగ్ పూర్తి చేసి డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఈ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇదే డేట్‌ను ఫిక్స్ చేస్తారో లేకపోతే మళ్లీ పోస్ట్ పోన్ అవుతుంది ఏమో తెలియదు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్‌ను పెట్టుకుని ఓజీ షూటింగ్‌కి కూడా డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఓజీ షూటింగ్ కూడా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూాడా చూడండి: War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే
ఓజీ మూవీలో ప్రియాంక మోహన్(Priyanka Arul Mohan) పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వీరి మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ హాస్పిటల్‌లో చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక మోహన్ డాక్టర్ క్యారక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ముంబై వెళ్లనున్నారు. అక్కడ దాదాపుగా పది రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు.
ఇది కూాడా చూడండి: Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి
పవన్‌తో విలన్‌కు ఉన్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని మూవీ టీం ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే సినిమాను ముందుగా సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 25 న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే నెల జూన్ 10కి మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్‌లో పాల్గొనున్నారని సమాచారం. ఎన్నికల కంటే ముందే ఈ మూడు సినిమాలకు సైన్ చేశారు. వీటి షూటింగ్‌ను ఈ ఏడాది ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.