Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి

Gmail : ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఈమెయిల్ ఉపయోగిస్తున్నారు. ఈమెయిల్ విషయానికి వస్తే ఎక్కువగా ఉపయోగించే వేదిక Gmail. కానీ Gmailలో కొన్ని అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. అవి మీ పనిని సులభతరం చేయడమే కాకుండా చాలా సమయాన్ని కూడా ఆదా చేస్తాయి? Gmail 4 అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫీచర్లు మీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి.
స్మార్ట్ కంపోజ్ (Smart Compose) ఫీచర్
మీరు ఈమెయిల్ రాసేటప్పుడు ఎలా ప్రారంభించాలో లేదా ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తూ ఉంటే Gmail స్మార్ట్ కంపోజ్ ఫీచర్ మీకు సాయపడుతుంది. మీరు ఈమెయిల్ టైప్ చేయడం ప్రారంభించినప్పుడు Gmail ఆటోమేటిక్ గా మీరు ఏమి రాయగలరో వాటి సూచనలు ఇస్తుంది. ఈ సూచనలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇస్తుంది. ఇది ఈమెయిల్‌లను త్వరగా వ్రాయడానికి, పంపడాన్ని సులభతరం చేస్తుంది.
Read Also:Actress: పెళ్లయిన 15 రోజులకే భర్త.. 25 ఏళ్లకే సినిమాకు గుడ్ బై.. ఆ నటి ఎవరంటే?
స్మార్ట్ రిప్లై (Smart Reply) ఫీచర్
కొన్నిసార్లు మనం థాంక్యూ, ఓకే లేదా నేను మీకు త్వరలో సమాధానం ఇస్తాను వంటి ఒకే ఒక్క లైన్‌లో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అలాంటి సందర్భాలలో Gmail స్మార్ట్ రిప్లై ఫీచర్ మూడు చిన్న సమాధాన సూచనలను ఇస్తుంది. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఒకే క్లిక్‌తో ఆన్సర్ సెండ్ చేయవచ్చు. దీంతో మీకు చాలా టైం ఆదా అవుతుంది.
అన్‌డూ సెండ్ (Undo Send) ఫీచర్
చాలాసార్లు మనం పొరపాటున ఎవరికైనా ఈమెయిల్ పంపుతాము లేదా ఏదైనా ముఖ్యమైన వివరాలు మిస్ అవుతాయి. అలాంటి సందర్భాలలో Gmail అన్‌డూ సెండ్ ఫీచర్ ఒక లైఫ్‌సేవర్‌గా పనిచేస్తుంది. ఈమెయిల్ పంపిన తర్వాత, కొన్ని సెకన్ల పాటు స్క్రీన్‌పై అన్‌డూ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈమెయిల్‌ను తిరిగి తీసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్.
Read Also:Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!
ఈమెయిల్ షెడ్యూల్ (Schedule Send) ఫీచర్
మీరు మీ ఈమెయిల్‌ను ఒక నిర్దిష్ట సమయంలో పంపాలని అనుకుంటే Gmailలో మీరు ఈమెయిల్‌ను షెడ్యూల్ చేయవచ్చు. సెండ్ ఎంపికలోని యారో పై క్లిక్ చేసి, షెడ్యూల్ సెండ్ ఎంచుకోండి. ఇప్పుడు మీరు తేదీ, సమయాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు.
-
Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
Tecno pova series: 6000mAh బ్యాటరీతో టెక్నో పోవా 7 సిరీస్ మొబైల్.. ఫీచర్లు చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే!
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Huawei smart band 10: హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్.. బెస్ట్ ధరకు ఫీచర్లు