Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Sankranthiki Vastunnam Biggest Milestone

Sankranthiki Vastunnam: బిగ్గెస్ట్ మైల్ స్టోన్ దాటవేసిన వెంకీ మామ మూవీ.. ఓటీటీలో రికార్డులు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం

Sankranthiki Vastunnam: బిగ్గెస్ట్ మైల్ స్టోన్ దాటవేసిన వెంకీ మామ మూవీ.. ఓటీటీలో రికార్డులు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 8, 2025 / 01:07 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Sankranthiki Vastunnam:

హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా మార్చి 1వ తేదీన ఓటీటీ, టీవీలోకి వచ్చింది. జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మరో మైల్ స్టోన్‌ను దాటింది. ఈ సినిమా ఓటీటీలో 300 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ఈ విషయాన్ని జీ5 సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఓటీటీలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇన్ని మిలియన్ల నిమిషాల్లోనే దాటేసింది. ఈ సినిమా ముందు నుంచే రికార్డులు సాధిస్తుంది. థియేటర్లలో విడుదల అయ్యి.. రూ.300 కోట్లు సాధించింది. మార్చి 1న జీ5 ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా రికార్డుల్లోకి ఎక్కింది. ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన 12 గంటల వ్యవధిలో 1.3 మిలియన్ల (13 లక్షలు) మంది వ్యూవర్స్ ఈ సినిమాను చూశారు. దీంతో పాటు 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలుగా జీ5 ఓటీటీలో సరికొత్త రికార్డుగా నిలిచింది. వచ్చిన 12 గంటల్లో ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్ సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా జీ5లో స్ట్రీమింగ్‍ అవుతోంది.

సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రాంతీయ భాషలో రిలీజ్ అయ్యి రూ.300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. దిల్‍రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ కూడా అలరించింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారట. అక్షయ్ కుమార్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేశాడు. కానీ ఇలాంటి కామెడీలో ఉండే సినిమాలు చేయలేదు. దీంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరని ఫిక్స్ అయిన తర్వాత త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు సినిమాను వేరే డైరెక్టర్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నారు.

Tag

  • million minuts
  • ZEE Telugu
Related News
  • RK Roja: బుల్లి తెరపై మళ్లీ రీ ఎంట్రీ.. ఆ ఛానెల్‌లో ప్రసారమయ్యే షోకు జడ్జ్‌గా రోజా

  • Sankranthiki Vastunnam: ఓటీటీ కంటే ముందుగానే.. టీవీల్లోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us