Sankranthiki Vastunnam: ఓటీటీ కంటే ముందుగానే.. టీవీల్లోకి వచ్చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ

Sankranthiki Vastunnam:
హీరో వెంకటేష్ (Hero Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ కూడా అలరించింది. మంచి హిట్ టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు రూ.300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.
అయితే ఈ సినిమాను ఓటీటీలో (OTT) కంటే ముందుగానే టీవీల్లోకి వచ్చేస్తుంది. మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్నట్లు ప్రకటించింది. ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లోకి సినిమా వచ్చే అవకాశం ఉందని ముందుగానే మూవీ టీం ప్రకటించింది. అయితే మహా శివరాత్రి సందర్భంగా సినిమా టీవీలో ప్రసారం చేయనున్నారని వార్తలు వచ్చాయి. కానీ సినిమాను మార్చి 1వ తేదీన ప్రసారం చేయనున్నట్లు తాజాగా జీ తెలుగు ప్రకటించింది. మార్చి 1వ తేదీ శనివారం కావడంతో ఈ తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో ప్రసారం కానుందని ఇదివరకే జీ తెలుగు తెలిపింది. మళ్లీ సంక్రాంతి వైబ్‌కి సిద్ధంగా ఉండండని.. వెల్లడించింది. అయితే అప్పుడు జీ తెలుగు తేదీని ప్రకటించలేదు. తాజాగా మూవీ టెలీకాస్ట్ తేదీని ప్రకటించింది. అయితే మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థియేటర్లు ఫుల్‌గా ఉండటం, వీలు కుదరక పోవడం వంటి కారణాల వల్ల చాలా మంది చూడలేదు. ఓటీటీలోకి వస్తే ఎప్పుడు చూద్దామని ఆసక్తిగా కొందరు ఎదురుచూస్తున్నారు.
అయితే టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఓటీటీలోకి వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీవీలో ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో రికార్డు సృష్టించినట్లే టీవీల్లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చింది. దీనికి భీమ్స్ సెసిరోలియో సంగీతం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.
-
Sankranthiki Vastunnam: బిగ్గెస్ట్ మైల్ స్టోన్ దాటవేసిన వెంకీ మామ మూవీ.. ఓటీటీలో రికార్డులు సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం
-
Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం ఆల్‌టైం హిస్టరీ.. ఏకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను బీట్ చేసి రికార్డు
-
Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం ఆ రోజే ఓటీటీలోకి.. థియేటర్లలో రాని సీన్లు కూడా..
-
RK Roja: బుల్లి తెరపై మళ్లీ రీ ఎంట్రీ.. ఆ ఛానెల్‌లో ప్రసారమయ్యే షోకు జడ్జ్‌గా రోజా