Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం ఆల్‌టైం హిస్టరీ.. ఏకంగా ఆర్‌ఆర్‌ఆర్‌ను బీట్ చేసి రికార్డు

Sankranthiki Vastunnam:
హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా మార్చి 1వ తేదీన ఓటీటీ, టీవీలోకి వచ్చింది. జీ 5 ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 ఓటీటీలోకి వచ్చి కొన్ని గంటల్లోనే ఈ సినిమా రికార్డుల్లోకి ఎక్కింది. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన 12 గంటల వ్యవధిలో 1.3 మిలియన్ల (13 లక్షలు) మంది వ్యూవర్స్ ఈ సినిమాను చూశారు. దీంతో పాటు 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలుగా జీ5 ఓటీటీలో సరికొత్త రికార్డుగా నిలిచింది. వచ్చిన 12 గంటల్లో ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్ సినిమాల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించుకుని రికార్డు సృష్టించింది. థియేటర్లలో రిలీజైన 46 రోజులకే ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే దుమ్ము లేపుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే జీ తెలుగు టీవీలో కూడా ప్రసారం అయ్యింది. టీవీలో కూడా భారీ టీఆర్పీ నమోదైనట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప్రాంతీయ భాషలో రిలీజ్ అయ్యి రూ.300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. దిల్‍రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా అందరినీ కూడా అలరించింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారట. అక్షయ్ కుమార్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేశాడు. కానీ ఇలాంటి కామెడీలో ఉండే సినిమాలు చేయలేదు. దీంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరని ఫిక్స్ అయిన తర్వాత త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు సినిమాను వేరే డైరెక్టర్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.