Tollywood Heroine : అమ్మ చేతి గోరుముద్దలు తింటున్న ఏ చిన్నారి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…

Tollywood Heroine :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు అందం, అభినయం ఉన్నా కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించలేకపోతున్నారు. కొంతమంది హీరోయిన్లు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు ఇతర భాషల్లోకి చెక్కేస్తున్నారు. అలాగే మరి కొంతమంది సినిమాలలో సెకండ్ హీరోయిన్స్ గా కూడా చేస్తున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది. కంటెంట్ విషయంలో అలాగే ఆర్టిస్టుల విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ కొత్తదనం కోరుకుంటుంది. మనవాళ్లు అందం, అభినయం ఉన్న అమ్మాయిలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో చాలామంది ముద్దుగుమ్మలు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వరుసగా అవకాశాలు వచ్చి కొంచెం అదృష్టం కలిసి వస్తే వాళ్లు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో రాణించారు. శ్రియ, త్రిష, కాజల్, నయనతార వంటి పలు హీరోయిన్స్ ఈ జాబితాకు చెందిన వారే. ప్రస్తుతం ఒక హీరోయిన్ తెలుగు కుర్రాళ్లకు మోస్ట్ వాంటెడ్ క్వీన్ గా మారింది. చాలామంది ఆమె ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్న చిన్నారి కూడా కొంతకాలం క్రితం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఈమె 2018లో సెమినా మిస్ ఇండియా లో విజేతగా మరియు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్ గా నిలిచింది. హీరో సుశాంత్ కి జోడిగా ఈమె ఒక సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయినప్పటికీ ఈమె స్క్రీన్ ప్రజెంట్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఈ హీరోయిన్ మరెవరో కాదు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ కిలాడి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులు కూడా వేసి అందరి చేత ప్రశంసలు కూడా అందుకుంది. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. అడవి శేషుకు జోడిగా హిట్ 2 సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా మీనాక్షి చౌదరి నటించింది. విశ్వక్సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలకు జోడిగా సినిమాలలో నటించింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకుంది. కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఓకే చేసింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే కొన్నాళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీనాక్షి చౌదరి తన ముద్దుల వేస్తుందన్న విషయం మాత్రం వాస్తవమని తెలుస్తుంది
View this post on Instagram
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..
-
Akkineni Nagarjuna : నాగార్జున కి తల్లిగా..నాగ చైతన్య కి లవర్ గా నటించిన ఏకైక హీరోయిన్!
-
Viral Photo : ఈ బుడ్డోడు ఎవరో చెప్పగలరా.. మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన హీరోగా బాగా ఫేమస్..
-
Viral Photo : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈమె అందానికి కుర్రాళ్ళ మతి పోవాల్సిందే…లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Tollywood Heroine : రెండు జడలు వేసుకుని సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్…ఎవరో గుర్తుపట్టారా..