Chiranjeevi House High Court: ఇంటికోసం హైకోర్టుకెక్కిన చిరంజీవి
Chiranjeevi House High Court జస్టిస్ వీ విజయ్ సేన్ రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. 2002 లో గ్రాండ్, మరో రెండంతస్థుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది తెలిపారు.

Chiranjeevi House High Court: చిరంజీవి తన జూబ్లిహిల్స్ ఇల్లు పునరుద్ధరణ పనులను క్రమబద్దీకరించాలని దరఖాస్తు చేసున్నాడు. దీనిపై జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులుజారీ చేసింది. ఇల్లు పునరుద్దరణ చర్యల్లో భాగంగా రిటెయిన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్ఎంసీకి చేసుకున్న దరఖాస్తుపై స్పందన లేదంటు చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ వీ విజయ్ సేన్ రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. 2002 లో గ్రాండ్, మరో రెండంతస్థుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు న్యాయవాది తెలిపారు. తనిఖీ చేసి క్రమబద్దీకరించాలన్న అభ్యర్థనను జీహెచ్ఎంసీ పట్టించుకోలేదని తెలిపారు. అలాగే దీనిపై జీహెచ్ఎసంీ న్యాయవాది స్పందిస్తూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.