Jobs: 10వ తరగతి అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. అసలు మిస్ చేసుకోవద్దు

Jobs: చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఎక్కువ చదువులు చదవకపోయినా కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్లాన్ చేస్తుంటారు. దీని కోసం వచ్చిన నోటిఫికేషన్లు అన్నింటికి అప్లై చేస్తుంటారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం. ఎంత కష్టపడినా కూడా కొన్నిసార్లు ఉద్యోగం రాదు. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారంటే మీకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. రాజస్థాన్ హైకోర్టు 2025 సంవత్సరానికి క్లాస్ IV ఉద్యోగుల నియామకాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,670 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు రాష్ట్రంలోని వివిధ జిల్లా కోర్టులు, న్యాయ సంస్థలలో జరగనున్నాయి. మీరు 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే ఈ పోస్టులను రాజస్థాన్‌లోని అన్ని జిల్లాలలోని వివిధ కోర్టులు, కేటగిరీల వారీగా విభజించారు. వీటికి అప్లికేషన్లు జూలై 26న ప్రారంభమవుతుంది. జూలై 26వ తేదీ చివరి వరకు ఉంటుంది. అయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. రాజస్థాన్ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు.
రిజర్వ్డ్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వారికి రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ రూ.350 ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో ముందుగా రాత పరీక్ష లేదా 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తీస్తారు. దీని తర్వాత ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. జిల్లా, కేటగిరీ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 10వ తరగతి మార్కుల జాబితా, సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, అసలు చిరునామా రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం చేసుకోవాలి. ముందుగా రాజస్థాన్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ hcraj.nic.in లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. అయితే దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్‌వుట్ తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Rajasthan School Collapse: ఘోర విషాదం.. కుప్పకూలిన స్కూల్ పైకప్పు
-
Chiranjeevi House High Court: ఇంటికోసం హైకోర్టుకెక్కిన చిరంజీవి
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు