Rajasthan School Collapse: ఘోర విషాదం.. కుప్పకూలిన స్కూల్ పైకప్పు
Rajasthan School Collapse ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు.

Rajasthan School Collapse: రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ పైకప్ప కూలి ఏడుగురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై పీఎం మోదీ సహా సిఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు క్లాస్ లో కూర్చుని ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సాయంతో టీచర్లు శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. 20 ఏళ్ల కిందటి ఈ ఏళ్ల కిందటి నాటి ఈ స్కూట్ భవనానికి మరమ్మత్తులు అవసరమని గతంలో పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంతకాలంగా ఇక్కడ వర్షాలు పడుతుండడంతో ఈ ఘోరం జరిగింది. పైకప్పు రాళ్లతో కట్టి ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.