Movie Combination: వీరిద్దరి కాంబినేషన్‌లో మిస్ అయిన మూవీ ఇదే
బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లో వారి మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ వచ్చిన కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ యాక్టర్లు సౌత్‌లో తమ పేరును నాటాలని అనుకుంటున్నారు.

Movie Combination: బాలీవుడ్ హీరోలు టాలీవుడ్‌లో వారి మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ వచ్చిన కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడే కాకుండా ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ యాక్టర్లు సౌత్‌లో తమ పేరును నాటాలని అనుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోలతో ఉంటే ఇక్కడ వారి మార్క్‌ను చూపించుకోవచ్చని మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ స్టార్ హీరో కలిసి ఏదైనా సినిమా చేస్తే పక్కా హిట్ అని, బాక్సాఫీస్‌లు బద్దలు అవుతాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్ కాంబోలో సినిమా ప్లాన్ చేశారట. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే పక్కాగా హిట్ అవుతుందని భావించి చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఓపెన్సింగ్స్ నుంచి క్లోజింగ్ వరకు భారీ వసూళ్లు రాబడతాయని టాక్ వినిపిస్తోంది. నార్త్‌లో హృతిక్ రోషన్‌కు మంచి క్రేజ్ ఉంది. అలాగే టాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ వల్ల సినిమా రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు.
Read Also: మరో కొత్త స్టోరీతో ప్రదీప్ రంగనాథన్.. మరో హిట్ తన ఖాతాలో పడినట్లేనా!
సౌత్‌లో ఎలాగైనా తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో అమీర్ ఖాన్ ఎన్టీఆర్‌తో కలిసి సినిమాలో నటించాలని అనుకున్నారట. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను అమీర్ ఖాన్ ఎన్టీఆర్‌తో కలిసి చేయాలని అనుకున్నాడట. 2022లో రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ దగ్గర రివైర్స్ అయ్యింది. ఘోరంగా ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం లో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ నాగ చైతన్యకు మంచి ఎమోషనల్ క్యారక్టర్ పడింది అనే టాక్ అప్పట్లో వచ్చింది. అయితే ఈ క్యారక్టర్ ని ముందుగా ఎన్టీఆర్ తో చేయించాలని అమీర్ ఖాన్ అనుకున్నాడు. ఈ విషయంపై ఎన్టీఆర్ ని కూడా సంప్రదించాడు. అయితే దీనికి ఎన్టీఆర్ స్పందించారు. ఇలాంటి హీరో నుంచి అవకాశం రావడం ఎక్కువ అన్నట్ల ప్రవర్తించారు. ఇంతటి మహానటుడితో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు హ్యాపీ. కానీ ఆ పాత్ర తనకు సెట్ కాదని.. దయచేసి ఏమి అనుకోవద్దు.. రిజక్ట్ చేసినందుకు అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ సినిమాకు ఎన్ని ప్రమోషన్లు చేసినా కూడా హిట్ కాలేదు. భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
Read Also: యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? కొల్లాజెన్ థ్రెడ్ ట్రీట్‌మెంట్ తీసుకోండి